Gopichand, Suma: ఆ షోలో సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్.. షాక్ లో సుమ!

యాక్షన్ హీరో గోపీచంద్ రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం లౌక్యం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా మే నెల ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హైయతి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమ అడ్డా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవాస్, గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతి పాల్గొన్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే సుమ తన కామెడీ పంచ్ లతో సెటైర్లు వేయగా గోపీచంద్ సైతం సుమకు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.

ఇలా ఈ ప్రోమో ఎంతో సరదాగా సాగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సుమ వీరితో ఒక మనీ గేమ్ ఆడించింది. అయితే ఈ గేమ్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా గోపీచంద్ యాంకర్ సుమ పట్ల చాలా వైల్డ్ గా ప్రవర్తించారు. ఇక ఈ గేమ్ ఆడుతున్న సమయంలోనే గోపీచంద్ గట్టిగా సుమ గొంతు పట్టుకున్నారు. అయితే ఈయన ఇలా గొంతు పట్టుకోవడంతో ఒక్కసారిగా అందరూషాక్ అయ్యారు అసలు గోపీచంద్ సుమ గొంతు ఎందుకు పట్టుకున్నారనే విషయాన్ని మాత్రం ప్రోమోలో రివిల్ చేయలేదు.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సుమ పట్ల(Gopichand) గోపీచంద్ ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అనే విషయం తెలియాలంటే ఏప్రిల్ 29వ తేదీ ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus