నేచురల్ స్టార్ నాని (Nani) వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. మరోపక్క అతని నిర్మాణంలో రూపొందిన ప్రతి సినిమా హిట్ అయ్యింది. ముఖ్యంగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ‘హిట్'(హిట్ : ది ఫస్ట్ కేస్) (HIT), ‘హిట్ 2′(హిట్ : ది సెకండ్ కేస్) వంటివి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ‘హిట్’ యూనివర్స్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని టీమ్ చెప్పిన సంగతి తెలిసిందే.
సో ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ‘హిట్ 8’ లో .. ‘హిట్ 7′ వరకు నటించిన హీరోలందరూ కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని తెలుస్తుంది.’హిట్’ లో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించాడు. ‘హిట్ 2’ లో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించాడు. ‘హిట్ 3’ లో (HIT 3) నాని హీరోగా నటిస్తున్నాడు.
అలాగే ‘హిట్ 2’ హీరో అడివి శేష్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. వాస్తవానికి విశ్వక్ సేన్ కూడా నటించాలి. కానీ అతను నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి ఇష్టపడట్లేదు అని సమాచారం. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట.ఇక అడివి శేష్ కి అలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి అతను ఓకే చెప్పాడు. అయితే క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరోని కూడా రివీల్ చేస్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.
మొన్నటి వరకు బాలయ్య.. ‘హిట్ 4’ హీరో అంటూ టాక్ కూడా నడిచింది. అయితే ఇప్పుడు తెలుగులో బాగా పాపులర్ అయిన తమిళ హీరో కార్తీ (Karthi) ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ‘హిట్ 3’ (HIT3) లో కార్తీ కామియో కూడా ఉంటుందట. అయితే ఈ విషయంపై టీం ముందుగా క్లారిటీ ఇస్తుందా? లేక సర్ప్రైజ్ కోసం సినిమాలో చూపిస్తుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.