కార్తీ 25వ సినిమా ‘జపాన్’ నుండి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న 25వ సినిమా ‘జపాన్’. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మినిమమ్ గ్యారెంటీ సినిమాలను అందించే ‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’ సంస్థ పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు అనగా మే 25న కార్తీ పుట్టినరోజు సందర్భంగా ‘జపాన్’ నుండి ఓ గ్లింప్స్ ని వదిలారు. ఇది ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఈ చిత్రంలో జపాన్‌గా చేస్తున్న కార్తీ పై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది.

‘ఊసరవెల్లి’ లో ఎన్టీఆర్ లా అనమాట. ఓ రకంగా ఈ గ్లింప్స్ చూస్తే ఆ సీన్ గుర్తుకొచ్చేలానే ఉంది. అయితే మరోసారి కార్తీ తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా సాగేలా చేశాడని చెప్పొచ్చు. ‘జపాన్ .. మేడ్ ఇన్ ఇండియా’ అంటూ అతను పలికే డైలాగ్ ఫన్నీగా ఆకట్టుకునే విధంగా ఉంది. కార్తీ లుక్ కొత్తగా ఉంది. గిరజాల జుట్టుతో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారిగా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. సునీల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. జి వి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా… ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు. కార్తీ నటించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ‘పొన్నియన్ సెల్వన్ 1’ ‘సర్దార్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.

మరీ ముఖ్యంగా కార్తీ సినిమాలు దీపావళి టైంలో రిలీజ్ అయితే సూపర్ హిట్ అవుతాయి అనే సెంటిమెంట్ ఉంది. ‘జపాన్’ కూడా దీపావళికే రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus