కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అయిన అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.’అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శ్రీమతి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి ఐ.ఎం.డి.బి లో అయితే మంచి రేటింగ్ వచ్చింది కానీ క్రిటిక్స్ నుండీ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనే విధంగా నమోదయ్యాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ చిత్రం స్లో అయిపోయింది.2 వారంలో రిపబ్లిక్ డే హాలిడే రోజున తప్ప ‘హీరో’ కలెక్ట్ చేసింది పెద్దగా ఏమీ లేదు. ఒకసారి 2 వారాల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.89 cr |
సీడెడ్ | 0.43 cr |
ఉత్తరాంధ్ర | 0.46 cr |
ఈస్ట్ | 0.23 cr |
వెస్ట్ | 0.16 cr |
గుంటూరు | 0.28 cr |
కృష్ణా | 0.15 cr |
నెల్లూరు | 0.09 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.69 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.09 Cr |
ఓవర్సీస్ | 0.10 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.88 cr |
‘హీరో’ చిత్రానికి రూ.5.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.88 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే ఇంకా 50 శాతం కూడా రికవరీ కాలేదు. బ్రేక్ ఈవెన్ కు మరో 3.12 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రెండు రోజులు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం తర్వాత స్లీపేసింది.2 వ వారం ఈ చిత్రం పెద్దగా రాణించింది లేదు. ఈ వీకెండ్ తర్వాత ‘హీరో’ ఫుల్ రన్ దాదాపు ముసినట్టే. మరి ఈ రెండు రోజులు ఎంత రాబడుతుందో చూడాలి..!
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!