కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అయిన అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘హీరో’.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.’అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శ్రీమతి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్న రేంజ్ లో ఆ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. కామెడీ వరకు ఓకె అనిపించినా కథనం స్లోగా సాగుతుండడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనే విధంగా నమోదయ్యాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కిందా మీదా పడుతుంది.
‘హీరో’ 4 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.43 cr |
సీడెడ్ | 0.21 cr |
ఉత్తరాంధ్ర | 0.32 cr |
ఈస్ట్ | 0.13 cr |
వెస్ట్ | 0.09 cr |
గుంటూరు | 0.16 cr |
కృష్ణా | 0.08 cr |
నెల్లూరు | 0.06 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.48 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.07 Cr |
ఓవర్సీస్ | 0.08 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.63 cr |
‘హీరో’ చిత్రానికి రూ.5.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.63 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 4.37 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రెండు రోజులు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం వీక్ డేస్ లో స్లీపేసింది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ‘బంగార్రాజు’ తప్ప సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయాయి. ‘హీరో’ అయినా నిలబడుతుంది అనుకుంటే.. ఇది కూడా నిరాశపరిచింది.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!