Naga Chaitanya: పెట్టిన ముద్దులు ఎలా గుర్తుంటాయి.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్!

  • May 4, 2023 / 02:01 PM IST

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 12వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే తాజాగా నాగచైతన్య యూట్యూబర్ ఇర్ఫాన్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అయితే ఈయన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో ఎక్కడా కూడా తన విడాకుల గురించి వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించలేదు. అయితే నాగచైతన్య తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. ట్రూత్ అండ్ డేర్ సెగ్మెంట్లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య ప్రశ్నిస్తూ ఇప్పటివరకు మీరు ఎంతమందికి ఎన్ని ముద్దులు పెట్టారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాగచైతన్య ఆసక్తికరమైన సమాధానం చెప్పారు .

తాను చాలా మందికి ముద్దులు పెట్టానని అయితే ఎన్ని పెట్టానో గుర్తులేదు అంటూ సమాధానం చెప్పారు. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే ఇందులో దాచుకోవాల్సిందేమీ లేదు అంటూ చైతన్య వెల్లడించారు. ప్రతి సినిమాలోను ఇలా ముద్దు సన్నివేశాలు ఎన్నో ఉంటాయి అయితే వాటిని గుర్తు పెట్టుకోలేము కదా అంటూ సమాధానం చెప్పుకొచ్చారు..

ఇక ఈ ఇంటర్వ్యూలో (Naga Chaitanya) చైతన్య మాట్లాడుతూ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నేను కాస్త ఇబ్బందులలో కూడా పడతానని నాకు అర్థం అవుతుంది అంటూ ఫన్నీగా సమాధానం చెప్పారు.అయితే ప్రస్తుతం నాగచైతన్య శోభిత ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చైతన్య ఏం మాట్లాడినా కూడా వైరల్ అవుతుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus