‘అంటే సుందరానికీ’ ఆవకాయ లాంటిది..రాను రాను టేస్ట్ వస్తుంది: నాని

నాని నటించిన ‘అంటే సుందరానికీ!’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ ను ఈరోజు ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న హీరో నాని మాట్లాడుతూ..”అంటే సుందరానికీ’ విజయం క్రెడిట్ అందరిదీ. అందరం కలిసి ‘అంటే సుందరానికీ’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు కేవలం బాక్సాఫీసు నెంబర్లు బట్టి కాదు.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమాకి దక్కిన ప్రేమను, ప్రేక్షకుల ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.

3 రోజులకే సినిమా బ్లాక్ బస్టర్ ఏంటి? అనే డౌట్ అందరికీ రావచ్చు. బ్లాక్ బస్టర్ అనేది టైం చెబుతుంది. కానీ సినిమా చూసిన వారి కళ్ళల్లో ఆనందం, వారి ప్రేమ విషయంలో ‘అంటే సుందరానికీ’ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ‘అంటే సుందరానికీ!’ అలాంటి అరుదైన సినిమా.! ఈ చిత్రానికి మరో చిత్రంతో పోలిక లేదు. ఇలా అరుదుగా వచ్చే సినిమాని మనం అందరం భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో మనమంతా భాగమవుతాము.

ఇది అవకాయ్ లాంటి సినిమా. మూడు రోజులు రుచి చూసారంటే… రోజురోజుకు ఊరుతుంది. రుచి ఇంకా పెరుగుతుంది. రెండేళ్ళ తర్వాత కూడా మంచి తెలుగు సినిమా పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే… అందులో కచ్చితంగా ‘అంటే సుందరానికీ’ పేరు ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి హిట్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం బాక్సాఫీస్ వద్ద నమోదు కావడం లేదు. ఈ విషయాన్ని పరోక్షంగా నాని తన స్పీచ్ లో చెబుతూనే వచ్చాడు.

‘మంచి సినిమా తీసినప్పుడు కలెక్షన్స్ రాలేదు.. కలెక్షన్స్ వచ్చే సినిమా చేస్తే మంచి సినిమా ఎప్పుడు తీస్తారు’ అన్నట్టు ఓ డైలాగ్ కూడా వాడాడు నాని. గతంలో పలు ప్రెస్ మీట్లలో నానికి ఎదురైన ప్రశ్నలే ఇవి. ఈరోజు స్టేజి పై వాటిని మరోసారి గుర్తుచేశాడు. సినిమా ఆవకాయ లాంటిది.. ముందు ముందు మంచి టేస్ట్ వస్తుంది అంటూ ఈ సినిమా రానున్న రోజుల్లో బాగా కలెక్ట్ చేస్తుంది అనే భ్రమలో నాని ఉన్నట్టు స్పష్టమవుతుంది. చూద్దాం నాని నమ్మకం ఎంత నిజమైందో..!

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus