Hero Nani, Suma: ‘జయమ్మ పంచాయితీ’ ప్రీ రిలీజ్ వేడుకలో సుమ పై నాని కామెంట్స్ వైరల్..!

సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా మే 6న విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని.. తనదైన శైలిలో సుమ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాని మాట్లాడుతూ.. ” నాగ్ సర్ ని ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది.

‘దేవదాస్’ తర్వాత మళ్ళీ ఆయన్ని ఇక్కడ కలుసుకున్నాం. ఈరోజు నా సినిమా ఫంక్షన్ ఏమైనా ఉన్నా దాన్ని ఎగ్గొట్టి మరీ ఇక్కడికి వచ్చేసేవాడిని. ఈరోజు నాకు చాలా కొత్తగా ఉంది. ప్రతీ సినిమా ఈవెంట్ కి మేము స్టార్ క్యాస్ట్ లో ఉండి మీరు స్టేజి మీద ఉండి.. ఈరోజు మీరు స్టార్ క్యాస్ట్ లో ఉండి మేము స్టేజి మీద ఉండడం చాల చాల విచిత్రంగా ఉంది. ఆవిడని ఎప్పుడు ‘మీరు మీరు సుమగారు’ అంటూ ఫార్మాలిటీగా పిలుస్తూ ఉంటాను.

వాటిని పట్టించుకోకుండా నా మనసుకి నచ్చిన పిలుపుతో పిలస్తే కనుక సుమక్క అని పిలవాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మనకి తెలీకుండానే మన ఇంట్లో మనిషి అయిపోయింది. నేను చాలా ఫంక్షన్స్ లో చెప్పాను, నేను సుమ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అని..! ఇండస్ట్రీలో పెద్దలు అసోసియేషన్ లు, గవర్నమెంట్ లు ఏం చేశాయో నాకు తెలీదు కానీ తెలుగు సినిమాకి, సుమ గారు మాత్రం చాలా చేశారు. మేమందరం రుణపడిపోయి ఉంటాము.

ప్రతీ సినిమా ముందు సుమ గారు మా ప్రాజెక్టుకి తీసుకొచ్చే పాజిటివ్ ఎనర్జీ మాకు ఎంతో అవసరం.. ‘థాంక్యు సో మచ్ ఫర్ గివింగ్ దట్ ఫర్ ఎవరీ ఫిలిం’ . మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఈవిడ స్టేజి మాత్రమే కాదు సిల్వర్ స్క్రీన్ పై కూడా ఆకర్షిస్తుంది. మీరు మరిన్ని సినిమాలు చేసి బిజీ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సుమ గారి ఫంక్షన్ అంటే మా ఇంట్లో ఫంక్షన్ లాంటిదే. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీం. సుమ గారి ఫంక్షన్ అంటే ఈ మాత్రం ఉండాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus