Hero Nani: అరిచి అరిచి, నవ్వి నవ్వి మీ చొక్కాలు తడిసిపోవాలి: నాని

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థగా పేరొందిన ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఇటీవల వైజాగ్ లో అభిమానుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకలో నాని వైజాగ్ అల్లుడొచ్చాడు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నాని భార్య అంజనా యలవర్తి సొంత ఊరు వైజాగ్ అన్న సంగతి తెలిసిందే.

ఈమె ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేసేది. నానిని పెళ్లి చేసుకున్నాక గృహిణిగా మారింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టి నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “వైజాగ్ మా అత్తగారి ఊరు. వైజాగ్ కి అల్లుడొచ్చాడు.(నవ్వుతూ) అల్లుడు వచ్చినప్పుడు అల్లుడికి విందుభోజనం పెడతారు. కానీ జూన్ 10న అల్లుడే అందరికీ విందు భోజనం పెడతాడు. బేసిగ్గా సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, బ్లాక్ బస్టర్ చేయాల్సింది మీరే అని అంటుంటాం.

కానీ ఈసారి అలా కాదు.. మేము బ్లాక్ బస్టర్ తీశాం. ఇంక దాన్ని ఎక్కడి తీసుకెళ్తారు అనేది మీ ఇష్టం. జూన్ 10 నుండి ‘అంటే సుందరానికీ’ మీది. ఒక సినిమా విజయానికి యాక్షన్, హ్యుమర్, ఎమోషన్ కారణం.ఈ ఏడాది యాక్షన్ కావలసినంత దొరికింది. హ్యుమర్, ఎమోషన్ కోసం ప్రేక్షకులు ఆకలితో ఎదురుచూస్తున్నారు. జూన్ 10న ‘అంటే సుందరానికీ’ థియేటర్ లో కావాల్సినంత హ్యుమర్, ఎమోషన్ దొరుకుతుంది.

నన్ను మీ ఫ్యామిలీలో ఒకరిగా చూస్తున్న ప్రేక్షకులకు, వైజాగ్ ప్రేక్షకులు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ‘అంటే సుందరానికీ’ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. వైజాగ్ సముద్రం లాగా… హ్యుమర్, ఎమోషన్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే వుంటాయి.జూన్ 10న అరిచి అరిచి, నవ్వి నవ్వి మీ చొక్కాలు తడిసిపోవాలి” అంటూ చెప్పుకొచ్చారు నాని.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus