Hero Nani: శ్యామ్ సింగరాయ్ మూవీ బడ్జెట్ అన్ని కోట్లా..?

అష్టాచమ్మా సినిమా నుంచి వీ సినిమా వరకు నాని తన సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు మాస్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు క్లాస్ సినిమాల్లో నాని నటించారు. సహజమైన నటనతో నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎంసీఏ సినిమా తరువాత ఆ స్థాయి హిట్ లేకపోయినా నాని మాత్రం రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు.

నాని నటించిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా శ్యామ్ సింగరాయ్ సినిమా కొంతమేర షూటింగ్ పూర్తైంది. పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిటెక్టివ్ రోల్ లో నాని నటిస్తున్నారని తెలుస్తోంది. థ్రిల్లింగ్ డిటెక్టివ్ స్టోరీగా శ్యామ్ సింగరాయ్ తెరకెక్కనుందని నాని కృతిశెట్టి మధ్య లవ్ ట్రాక్ ఉంటుందని సమాచారం. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

అయితే నాని డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసి నాని ఫ్యాన్స్ లో కొంతమంది నాని రిస్క్ చేస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి మెయిన్ హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus