Hero Nani Family: నాని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

నిన్న నాని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. నాని అలాగే తన కొడుకు అర్జున్ కలిసి దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫోటోతో పాటు మరి కొన్ని ఫోటోలను నాని ఈ సందర్భంగా షేర్ చేశాడు. నాని తండ్రి రాంబాబు గంట, తల్లి విజయలక్ష్మి గంట కూడా ఈ పూజలో పాల్గొన్నారు.నాని భార్య అంజన యాలవర్తి కూడా నానితో కలిసి పూజలో పాల్గొంటున్న ఫోటోలను మనం చూడొచ్చు.

కరోనా లాక్ డౌన్ కి ముందే నాని కొత్త విల్లా లోకి తన ఫ్యామిలీతో కలిసి షిఫ్ట్ అయ్యాడు. అప్పటి నుండి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించే టైం అతనికి దొరకలేదు. అసలే నానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ. నాని సినిమాలు అంతగా ఆడకపోవడం అలాగే ఎక్కువగా ఇతను వివాదాల్లో కూడా చిక్కుకోవడంతో.. ఈ పూజ జరిపించకపోవడం వలనే ఇవన్నీ జరుగుతున్నాయి అనే సెంటిమెంట్ అతనికి ఉన్నట్టు ఉంది. అందుకే నిన్న ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు నాని అలాగే అతని కుటుంబ సభ్యులు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘అంటే సుందరానికి!’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, ఆ చిత్రంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయాడు. ఓవర్సీస్ లో తప్ప ఈ మూవీ ఎక్కడా కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. అయితే ఈ ఏడాది ‘దసరా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. ఇది పక్కన పెడితే.. నాని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus