Dasara Movie: మార్చి నెలంతా ‘దసరా’ నే..!

ఈ రోజుల్లో మంచి సినిమా తీస్తే సరిపోదు. దానిని జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ మాట చెబితే కొంతమంది ఫిలిం మేకర్స్.. ‘జనాల్లోకి తీసుకెళ్లడం అంటే ఇంకేం చేయాలి.. ఓ అరగంట సినిమాని యూట్యూబ్లో పెట్టాలి.. బ్యాలెన్స్ చూడ్డానికి థియేటర్ కు రమ్మనాలి.. అదొక్కటే మిగిలింది’ అంటూ కసురుకుంటున్నారు. అయితే అంత సినిమా నెట్లో పెట్టనవసరం లేదు. మంచి ప్రమోషనల్ కంటెంట్ జనాలకు ఇవ్వాలి. ఏదో ఒక ఈవెంట్లు వంటివి పెట్టి.. ఆ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాలి.

అయితే వీటికి హీరోల నుండి పూర్తి సహకారం ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సినిమా పూర్తయిపోయింది కదా మనకు సంబంధం లేదు నెక్స్ట్ సినిమా చేసుకుందాం అనుకునే హీరోలు టాలీవుడ్లో చాలా మందే ఉన్నారు. ప్రమోషన్స్ కోసం రెండు, మూడు వారాలు కేటాయించడం కోట్ల రూపాయల కాల్ షీట్లు ఇచ్చినట్టే..! అలాంటి రిస్క్ నాని చేస్తానంటున్నాడు. నాని నటించిన ‘దసరా’ మూవీ మార్చి 30న విడుదల కాబోతుంది. అతను హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా సెట్స్ పై ఉంది.

ఇంకొంతమంది నిర్మాతలు మా సినిమా మొదలుపెట్టాలి అంటే మా సినిమా మొదలుపెట్టాలి అంటూ వెంటపడుతున్నారు. అయినా సరే నాని మాత్రం ‘దసరా’ ప్రమోషన్స్ కోసం ఏకంగా నెల రోజులు కేటాయించాడు. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, కేరళ వంటి ఏరియాల్లో తన సినిమాను ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యాడు. నానికి ఎలా ఉన్నా.. ఇది నిర్మాత సుధాకర్ చెరుకూరికి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు.

ఇప్పటివరకు అతని నిర్మాణంలో రూపొందిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలి అని ఈ సినిమాకు రూ.70 కోట్ల బడ్జెట్ పెట్టాడు. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం కూడా కోట్లు కుమ్మరిస్తున్నాడు. మరి హిట్టు కొట్టాలని ఆశపడుతున్న ‘దసరా’ దర్శకుడు, నిర్మాత ల ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus