Balayya Babu: బాబీ- బాలయ్య ప్రాజెక్టు గురించి క్రేజీ అప్డేట్..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ తో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్, ఒక పాట.. ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. అక్టోబర్ 19 న దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరోపక్క బాలకృష్ణ… ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీతో ఓ సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. జూన్ 10 న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ సొంత బ్యానర్ అయిన ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌’ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య – బాబీ సినిమా సెప్టెంబర్ 21 నుండి సెట్స్ పైకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 27 కి మారినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ చిత్రం కథ ప్రకారం మరో హీరోకి కూడా ఛాన్స్ ఉందట.

దీంతో టీం ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ ను కాంటాక్ట్ చేసినట్లు తెలుస్తుంది. కానీ దుల్కర్ టీం నుండి ఇంకా క్లారిటీ రాకపోవడంతో.. నానిని కూడా అప్రోచ్ అయ్యిందట చిత్ర బృందం. నాని కూడా హ్యాండిస్తే కనుక.. ఎవరైనా యంగ్ హీరోతో కంప్లీట్ చేయాలని దర్శకుడు బాబీ అండ్ టీం భావిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఏమవుతుందో..!

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus