Nani: ఊచకోత కోసే ముందు సేద తీరుతున్న నాని.. ప్లాన్ ఏమిటంటే?

ఒక సినిమా పూర్తికాగానే వెంటనే మరో షూటింగ్‌కి వెళ్లిపోయే నేచురల్ స్టార్ నాని  (Nani)  , ఈసారి మాత్రం తన కెరీర్‌కి చిన్న బ్రేక్ ఇచ్చుకున్నాడు. దసరా  (Dasara)  , హాయ్ నాన్న (Hi Nanna) , సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram) .. వంటి విజయాల తర్వాత ‘HIT 3’ (HIT3) కూడా పూర్తిచేసి, ఇటీవల ‘కోర్ట్’ (Court)  మూవీకి నిర్మాతగా ప్రమోషన్‌లతో బిజీగా కనిపించదు. సినిమా మంచి ఫలితాన్ని కూడా ఇచ్చింది. ఇక అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు స్వల్ప విరామం తీసుకుంటూ కుటుంబంతో సమయాన్ని గడపాలని డిసైడ్ అయ్యాడు.

Nani

మధ్యలో తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో (Cibi Chakaravarthi) ఓ ప్రాజెక్ట్ చర్చలు జరిగినా, ఫలితం దక్కలేదు. ఇక సుజిత్ (Sujeeth) డైరెక్షన్‌లో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ‘OG’ తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు, ‘ద ప్యారడైజ్’ (The Paradise)   అనే యాక్షన్ డ్రామా కూడా అప్‌కమింగ్ ఫేస్‌లో ఉంది. అయితే ఇవన్నీ సెట్స్ పైకి వెళ్లేలోగా తాను పూర్తిగా రిఫ్రెష్ కావాలని భావించాడు.

ఇవన్నీ కూడా చాలా హార్డ్ వర్క్ తో కూడుకున్న సినిమాలు. కాబట్టి పవర్ఫుల్ గా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే నాని ముందుగానే కొంత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లి రావాలని చూస్తున్నాడు. అంటే ఊచకోత కోసే ముందు రిలాక్స్ టైమ్ లాంటిదన్నమాట. విదేశీ ట్రిప్‌తో కుటుంబ సమయాన్ని ఎంజాయ్ చేస్తూనే, తన వాల్ పోస్టర్ బ్యానర్‌కి సంబంధించిన కొత్త ప్రాజెక్టులపై కూడా ఫోకస్ పెడుతున్నాడు నాని.

బడ్జెట్ పరంగా చిన్న సినిమాలు తీసి, మంచి కంటెంట్‌తో పెద్ద విజయం సాధించే లక్ష్యంతో మరోసారి వాల్యూ ప్యాక్డ్ సినిమాలు రెడీ చేస్తున్నట్లు టాక్. ఇక ‘HIT 3’ విషయంలో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో నాని పాత్ర మరింత డార్క్ షేడ్స్‌తో ఉంటుందని, ఇది అతని కెరీర్‌లోనే డిఫరెంట్ రోల్ గా నిలవనుందని ట్రేడ్ టాక్. ప్రత్యేకంగా యాక్షన్ పార్ట్ బాగా ఎలివేట్ అవుతుందని చెబుతున్నారు. మరి నాని ఫ్యూచర్ లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటాడో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus