Navdeep: నవదీప్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయి ఎవరంటే..

  • February 15, 2023 / 03:24 PM IST

ఈ వెడ్డింగ్ సీజన్‌‌లో సెలబ్రిటీలు ఒకొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు.. ఇటీవలే నాగ శౌర్య, హన్సిక వంటి స్టార్స్ తమ ప్రియమైన వారితో ఏడడుగులేశారు.. మరోవైపు శర్వానంద్ లాంటి వాళ్లు నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి ప్రిపేర్ అవుతున్నారు.. ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా గుడ్ న్యూస్ చెప్తున్నారు. యంగ్ హీరో నవీన్ చంద్ర వాలంటైన్స్ డే రోజు తాను తండ్రి కాబోతున్న విషయాన్ని రివీల్ చేశాడు. అదే రోజు యాక్టర్ నవదీప్ కూడా ఎంగేజ్‌మెంట్ న్యూస్‌తో సర్‌ప్రైజ్ చేశాడు..

వాలంటైన్స్ డే సందర్భంగా.. ఎంగేజ్‌మెంట్ రింగ్ ఉన్న ఓ అమ్మాయి పిక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేయడంతో అంతా షాకయ్యారు.. దీంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది.. ఫేస్ కనిపించకుండా.. కేవలం వేలికి నిశ్చితార్థపు ఉంగరం చేతిని మాత్రమే చూపిస్తూ.. ఖుషి అహూజా అనే అమ్మాయిని ట్యాగ్ చేశాడు నవదీప్.. పైగా ప్రేమికుల దినోత్సవం రోజు ఈ పోస్ట్ చేయడంతో తను కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడని అనుకున్నారు..

కట్ చేస్తే.. మనోడు అందర్నీ ఫూల్స్ చేశాడు.. ఎంగేజ్‌మెంట్ న్యూస్ కానీ, ఆ ఫోటో కానీ అంతా ప్రాంకే అని రివీల్ చేశాడు.. దీంతో అంతా.. ‘‘ఓరినీ నిజమే అనుకున్నాం.. ప్రాంక్ ఆ’’? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రేమికుల రోజు ఎంచక్కా సెలబ్రిటీలంతా మంచి మంచి పోస్టులు పెడుతుంటే.. నీకు మాత్రం ప్రాంక్ పేరుతో జనాలను పిచ్చోళ్లను చెయ్యాలని ఎలా అనిపించింది?.. సరే కానీ.. పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్? అని అడుగుతున్నారు.

హీరోగా ఎంట్రీ ఇచ్చి.. విలన్‌గా, ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నవదీప్ ప్రస్తుతం ‘లవ్ మౌళి’ అనే మూవీ చేస్తున్నాడు. దీనికోసం కొత్త లుక్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు.. అలాగే ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు.. ఈ రెండూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. వీటితో నటుడిగా బిజీగా మారతాననేే హోప్‌తో ఉన్నాడు నవదీప్..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus