Hero Nikhil: జో బైడెన్ పై నిఖిల్ ట్వీట్ వైరల్!

ఆఫ్ఘానిస్తాన్ ను కైవసం చేసుకున్న తాలిబన్లకు అమెరికా అధ్యక్షుడు చేసిన మాటలు ఆ చర్యను సమర్ధించినట్టుగా అనిపిస్తున్నాయి. ఇన్నేళ్లు ఆఫ్ఘనిస్తాన్ లో తన ఆర్మీను ఉంచిన అమెరికా ఇప్పుడు మాత్రం వెనక్కి తీసుకుంటోంది. ఇప్పటికే చాలా మంది సైనికులను వెనక్కి తీసుకొచ్చేసింది. ఆగస్టు 31వరకు మిగిలిన సైనికులందరినీ సైతం తీసుకొచ్చేలా ప్రణాళికలు వేస్తోంది. కాబూల్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ దేశాల పౌరులు, అర్హత కలిగిన ఆఫ్ఘాన్ ప్రజలు సైతం వేరే దేశాలను వెళ్లిపోతున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీద హీరో నిఖిల్ ఫైర్ అయ్యారు. ఆఫ్ఘన్, తాలిబన్ ఇష్యూ మీద జో బైడెన్ స్పందించారు. ఆఫ్ఘన్ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సురక్షిత పాలనను అందించడానికి తాలిబన్లు కృషి చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని జో బైడెన్ అన్నారు. ఒకవేళ తాలిబన్లు అలా చేయగలిగితే ఆఫ్ఘన్ కు ఆర్ధిక, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో సాయం చేస్తామని బైడెన్ తెలిపారు.

దీనిపై నిఖిల్ స్పందిస్తూ.. ‘చెప్పుతో కొడతా వెధవా’ అంటూ ఘాటుగా ట్వీట్ పెట్టారు. స్వేచ్చా ప్రపంచం అనే దానికి ఉదాహరన్ అమెరికా.. కానీ అది ఇప్పుడు పోయిందని.. 21 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పెట్టి ఇప్పుడు ఇలా పారిపోయారని అన్నారు. ఇంకెప్పుడైనా ఫ్రీడమ్ గురించి మాట్లాడితే.. చెప్పు తెగుద్ది వెధవా అంటూ జో బైడెన్ ను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు.


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus