యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఒకసారి పెళ్లి వాయిదా వేసుకున్న నిఖిల్ మే 14న వివాహం చేసుకున్నారు. తన ప్రేయసి పల్లవి మెడలో మూడు ముళ్ళు వేసి నిఖిల్ ఓ ఇంటివాడు అయ్యాడు. వృత్తి రీత్యా పల్లవి డాక్టర్ కావడం విశేషం. కాగా వీరి పాప పేరు మాయ అని తెలుస్తుంది. అదేంటి పెళ్ళైన నాలుగు నెలలకే పిల్లలేంటీ అని ఆశ్చర్య పోకండి. నిజంగా వీరికి ఇంకా పిల్లలు లేరు. ఐతే నిఖిల్ మాత్రం తనకు ఆడపిల్లే కావాలని కోరుకుంటున్నారట.
అలాగే తన కూతురు పేరు మాయ అని కూడా ఫిక్స్ అయ్యారట. ఈటీవీలో ప్రసారం అయ్యే ఫేమస్ టాక్ షోలో అలీతో సరదాగా లో పాల్గొన్న నిఖిల్ ఈ విషయాన్ని పంచుకున్నారు. అలీ మీ కూతురు పేరు మాయ అంట కదా అని అడుగగా, నిఖిల్ నవ్వుతూ ఈ కహాని బయటపెట్టారు. దీనికి చమత్కరిస్తూ అలీ ఒక వేళ అబ్బాయి పుడితే మాయలోడు అని పెడతావా…అని అడుగగా షోలో నవ్వులు పూశాయి. అలీ తో సరదాగా లేటెస్ట్ ప్రోమోలో ఈ ఆసక్తికర సంగతులు ఉన్నాయి.

కెరీర్ బిగినింగ్ లో పడ్డ ఇబ్బందులు, దర్శకుడు చందూ మొండేటితో ఉన్న అనుబంధం వంటి అనేక విషయాలు నిఖిల్ ఈ టాక్ షోలో తెలియజేశారు.కార్తికేయ వంటి బంపర్ హిట్స్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరు కలిగి కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా కార్తికేయ 2 చేస్తున్నారు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

Most Recommended Video
ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
