Nikhil: అర్థరాత్రి నుంచే సలార్ సినిమా చూడొచ్చు: నిఖిల్

ప్రభాస్ నటించిన సలార్ సినిమా మరొక వారం రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.అయితే ఈ సినిమా విడుదల అవుతున్నటువంటి తరుణంలో యంగ్ హీరో నిఖిల్ ప్రభాస్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభాస్ నటించిన సలార్ సినిమా చూడాలనుకున్నటువంటి 100 మంది అభిమానులకు ఈయన ఉచితంగా సినిమా టికెట్లు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని నిఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. డిసెంబర్ 21వ తేదీ అర్ధరాత్రి హైదరాబాదులోని శ్రీరాములు థియేటర్లో 100 మంది అభిమానులకు ఉచితంగా సలార్ సినిమా టికెట్లు అందివ్వబోతున్నానని మీతో పాటు నేను కూడా ఈ సినిమా చూస్తున్నానని తెలిపారు. గతంలో ఇలాగే ప్రభాస్ సినిమా కోసం తాను అభిమానులకు ఉచితంగా టికెట్లు ఇచ్చి వారితో పాటు సినిమా (Nikhil) చూశానని ఇప్పుడు అదే రిపీట్ అవ్వబోతుందంటే ఈయన తెలియజేశారు.

అయితే సరిగా పది సంవత్సరాలు క్రితం తాను ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమా కోసం అభిమానులకు ఉచితంగా టికెట్లు పంపిణీ చేసినట్లు నిఖిల్ తెలిపారు. నిఖిల్ ఇలా 100 మంది అభిమానులకు ఉచితంగా టికెట్లు ఇవ్వబోతున్నాను అని తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే మరి ఈ టికెట్లను ఎలా పొందాలి ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

ఇక ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus