ఈ కరోనా కాలంలో చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ప్రతిరోజు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఓ మధ్య తరగతి వ్యక్తిని ఎంతో వేధిస్తుంది. కొన్నిరోజుల క్రితం వరకు అందుబాటులో ఉన్న పెట్రోల్ ధర.. ఇప్పుడు ఏకంగా రూ.100 దాటేసింది. దీనిపై చాలా మంది నిరసన తెలుపుతున్నారు.
కేంద్రప్రభుత్వం ఎన్నికలు ఉన్న సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తూ.. ఓటర్లతో అవసరం తీరిపోయిన తరువాత మళ్లీ ధరలు పెంచుతుంది అంటూ ప్రభుత్వ తీరుని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ నియంత్రణలో మాత్రం కేంద్రం విఫలమవుతోంది. కొన్నిరోజుల క్రితం వరకూ ప్రతీరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతుంది. తాజాగా దీనిపై హీరో నిఖిల్ స్పందించారు. ”అసలేం జరుగుతోంది. 35 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్, డీజిల్ ధర పంపు వద్ద రూ.100 గా ఉంటుంది.
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే టాక్స్ లను వెంటనే రద్దు చేయాలి. ఈ ధరల పెంపు కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతీ ఒక్కరి తరఫున ఇది నా రిక్వెస్ట్” అంటూ నిఖిల్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కు మద్దతుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.
Why Is this happening ?
35 rs Per litre Petrol / Diesel is Costing us 100 Rs plus at the Fuel Pump.
The Central & State Taxes on Fuel Must be reduced. 🙏🏽 Sincere Request on behalf of every person suffering from this. pic.twitter.com/1zAPEAJyRX