‘అర్జున్ సురవరం’ గా మారిన నిఖిల్ ‘ముద్ర’.. !

నిఖిల్ హీరోగా దర్శకుడు టి.ఎన్.సంతోష్ తెరెక్కిస్తున్న తాజా చిత్రానికి మొదట ‘ముద్ర’ అనే టైటిల్ ని అనుకున్నప్పటికీ… కొన్ని వివాదాలు చోటుచేసుకోవడంతో ‘అర్జున్ సురవరం’ గా మార్చారు. కొద్దిరోజుల క్రితం.. ఈ ‘ముద్ర’ టైటిల్ కోసం నట్టికుమార్ అలానే నిఖిల్ ల మధ్య గొడవ జరిగింది. జగపతిబాబు హీరోగా తెరకెక్కిన చిత్రాన్ ‘ముద్ర’ పేరుతోనే విడుదల చేశాడు నట్టికుమార్.

ఈ కారణంతో.. ‘ముద్ర’ టైటిల్ విషయంలో రెండు చిత్రబృందాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఆల్రెడీ ‘ముద్ర’ పేరుతో సినిమా విడుదల కావడంతో ఇప్పుడు నిఖిల్ సినిమా పేరుని ‘అర్జున్ సురవరం’గా మార్చేశారు. తాజాగా మార్చిన టైటిల్ తో ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసంబర్ లోనే విడుదల కావాల్సినప్పటికీ… కొంచెం ప్యాచ్ వర్క్ ఉండడంతో మార్చికి మార్చారు. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించబోతున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ చిత్రానికి ఇది రీమేక్. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మర్చి 29న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus