ఈ మధ్యకాలంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరగడంతో.. ఒరిజినల్ కంటెంట్ కోసం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ క్యూ కడుతున్నాయి. ఓటీటీల్లో ఉండే లాభం గమనించిన నిర్మాతలు తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసి.. ఓటీటీలకు అమ్మేసుకుంటున్నారు. అందుకే సినిమా కథ, ఓటీటీ కథ అంటూ రెండు వర్గాలు తయారయ్యాయి. సినిమాకి సరిపడని కథలన్నీ ఓటీటీకి వెళ్తున్నాయి. కొంతమంది హీరోలు కేవలం ఓటీటీకి సరిపడే కథల కోసం అన్వేషిస్తున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు నితిన్ కూడా చేరిపోయాడు.
నితిన్ కి అర్జెంట్ గా ఓటీటీకి సరిపడ కథ కావాలట. దానికోసం దర్శకులను అడుగుతున్నాడని సమాచారం. ఇటీవల నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’ సినిమా ఓటీటీ కోసమే నిర్మించారు. ఆ సినిమాకి నితినే నిర్మాత. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. నితిన్ కి మాత్రం ఆ సినిమా భారీ లాభాలను తీసుకొచ్చింది. ఓటీటీకి సినిమాలను తీసి ఇవ్వడంలో ఉన్న సౌలభ్యాలు నితిన్ కి బాగా అర్ధమయ్యాయి. అందుకే ఓ చిన్న కథ,
తక్కువ రోజుల్లో పూర్తయ్యే సినిమా కోసం అన్వేషిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ హీరో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే.. ఓటీటీ ప్రాజెక్ట్ ను సెట్ చేసే ఛాన్స్ ఉంది.