టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో ఒకరు నితిన్. ఈయన తన తొలి సినిమా జయం తోనే ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా నైజాం ప్రాంతం లో స్టార్ హీరోల రికార్డ్స్ ని సైతం బద్దులు కొట్టి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది. కొన్ని సెంటర్స్ లో 700 రోజులు కూడా ఆడింది ఈ చిత్రం.
ఈ సినిమాతో నితిన్ కి ఎంత మంచి పేరు వచ్చిందో, ఇందులో విలన్ గా నటించిన గోపీచంద్ కి కూడా అంతే పేరు వచ్చింది. ఇద్దరిలో టాలెంట్ మొత్తాన్ని పిండేసాడు డైరెక్టర్ తేజ. ఉదయకిరణ్ తో ‘నువ్వు నేను’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన తర్వాత తేజ తీసిన చిత్రం ఇది. ఈ సినిమా గురించి నితిన్ కి మిగిలిన మధుర జ్ఞాపకాలు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాము.
ఈ సినిమా ఎలా ప్రారంభం అయ్యింది అని యాంకర్ అడిగిన ప్రశ్న కి (Nithiin) నితిన్ సమాధానం చెప్తూ ‘ అప్పట్లో నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాను. అప్పుడే నువ్వు నేను సినిమా వచ్చింది, ప్రసాద్ లాబ్స్ లో స్క్రీనింగ్ వేసినప్పుడు నేను కూడా వెళ్లి చూసాను. ఆ షో లో తేజ గారిని కలిసినప్పుడు, ఆయన నా దగ్గర జయం అనే సబ్జెక్టు ఉంది, నువ్వు చేస్తావా అన్నాడు, వెంటనే ఓకే చెప్పి ఆ సినిమా చేసేసాను.
సినిమాల్లోకి రావాలని అనుకోలేదు, అది అనుకోకుండానే జరిగిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు నితిన్. యాంకర్ మరో ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతూ, సెట్స్ లో ఉన్నప్పుడు తేజ గారు షాట్ సరిగా రాకపోతే కొడుతాడు అని అందరూ అంటుంటారు, మీ విషయం లో కూడా అలాంటిది ఏమైనా జరిగిందా అని అడగగా దానికి నితిన్ సమాధానం చెప్తూ ‘ఒకరోజు షూటింగ్ రెండు మూడు రోజుల్లో ముగుస్తుంది అనగా, ఆ రోజు లైట్ మ్యాన్ రాకపోవడం వల్ల తేజా గారు చాలా కోపం లో ఉన్నారు.
ఆ కోపం రిహార్సల్స్ ఉన్న నా మీద చూపించాడు. ఎంత చెప్పిన ఒక సన్నివేశం లో కావాల్సిన ఎమోషన్ రాకపోవడం తో ఆయన గట్టిగా కొట్టాడు. అప్పుడు మొట్టమొదటిసారి నేను సెట్స్ లోనే ఏడ్చేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు.