నితిన్ (Nithiin) చాలా గొప్ప మాట అన్నాడు. తన సినిమాల కథల విషయంలో, ఫలితాల విషయంలో పూర్తిగా అతనిదే జడ్జిమెంట్ అట. ఇంకొకరిని బ్లేమ్ చేయడం తనకు నచ్చదట. నితిన్ ఎంత డౌన్ టు ఎర్త్ పర్సనో ఈ ఒక్క మాటను బట్టి చెప్పొచ్చు. నిజమే.. ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. ఒక్కరికే క్రెడిట్ ఇవ్వడం.. లేదా ఒక్కరినే నిందించడం అనేది కరెక్ట్ కాదు. గతంలో మహేష్ బాబు కూడా ఇదే మాట చెప్పాడు.
తన సినిమాలు హిట్ అయితే ఆ క్రెడిట్ అందరికీ వస్తుంది. కానీ ప్లాప్ అయితే దానికి తన జడ్జిమెంట్ మాత్రమే కారణం అని. అయితే సక్సెస్ క్రెడిట్ అంతా ఎప్పుడూ హీరో చేతిలో పెట్టి.. ప్లాప్ అయితే దర్శకుల అకౌంట్లో పడేస్తారు నిర్మాతలు. ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) రిలీజ్ అయ్యింది.. నిర్మాత దిల్ రాజు (Dil Raju) , దర్శకుడు శంకర్ (Shankar), సంగీత దర్శకుడు తమన్(S.S.Thaman) .. ఎవరొకరి పై ఆ తప్పుని తోసేశారు కానీ.. ఎవ్వరూ మా ప్రయత్నంలో లోపం ఉంది..
మా జడ్జిమెంట్ తప్పయింది అని ఎవ్వరూ చెప్పుకోలేదు. ఈ విషయంలో నితిన్ చాలా బెటర్. ‘రాబిన్ హుడ్’ (Robinhood) ప్రమోషన్స్ లో భాగంగా అతను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో ఒక దశలో వరుసగా 13 ఫ్లాపులు వచ్చాయి. ‘ఇష్క్’ సినిమాతో మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చారు ఆడియన్స్. అయితే సినిమాలు ప్లాప్ అయినా ‘నితిన్ బాగా చేయలేదు’ అని నన్ను ఎవ్వరూ తిట్టలేదు.
కొన్ని సినిమాలు కథలు బాగోలేక ఆడలేదు. ఇంకొన్ని మంచి కథలున్నా ట్రీట్మెంట్ సరిగ్గా కుదర్లేదు అనుకుంటాను.నా సినిమాల కథల విషయంలో జడ్జిమెంట్ నాదే. తప్పో.. ఒప్పో బాధ్యత పూర్తిగా నాదే. నా ఫ్లాపులకు మరొకర్ని నిందించలేను” అంటూ చెప్పుకొచ్చాడు.