ఫ్యామిలీ ప్రేక్షకులను అన్నగా మెప్పించి మా అన్నయ్య. అక్క మొగుడుగా..అల్లరి ప్రియుడుగా అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టిన మగాడు..తెరపై విలన్స్‌తో ఎవడైతే నాకేంటి అని మూడో కన్నుతెరిచే శివయ్య. ఆగ్రహంలో కానీ, అల్లరిలోకానీ, తనదైన ప్రత్యేకమైన నటన కనబరిచినా అది ఆయనకే చెల్లింది. మ్యానరిజంలో తన స్టైలే వేరని నిరూపించి… యాంగ్రీ యంగ్ మాన్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాందించుకున్న గ్యాంగ్ మాస్టర్ డాక్టర్ రాజశేఖర్. చాలామంది నటులు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతారు. కానీ రాజశేఖర్ నటుడు కాక ముందే డాక్టర్.
సినిమా ఇండస్ట్రీకి రాకముందే ఎమ్.బి.బి ఎస్ చేసి చెన్నైలో డాక్టర్‌గా ప్రాక్టీస్ కూడా పెట్టాడు. రాజశేఖర్ మొదటిసారి భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా ‘పుదుమాయ్ పెన్’ చిత్రంతో తెరంగేట్రం చేసారు. ఆ తర్వాత 1885 లో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.‘శ్రుతిలయలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘మగాడు’, ‘అన్న’, అల్లరి ప్రియుడు’ ‘శివయ్య’, ‘మనసున్నమారాజు’, ‘మా అన్నయ్య’, సింహరాశి, ‘ఎవడైతే నాకేంటి’, ‘గోరింటాకు’ లేటెస్ట్‌గా ‘PSV గరుడ వేగ’ లాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. కానీ ఇంతటి మాస్ ఇమేజ్ ఆయనకు వూరికే రాలేదు.
దీని వెనుక ఎంతో కష్టం దాగుంది. ఒకానొక సమయంలో మధ్యలో వరుసగా సినిమాలన్నీ ప్లాఫులు కావడంతో రాజశేఖర్ ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు సొంతంగా నిర్మించిన సినిమాలు కూడా ఆయనకు నష్టాలనే మిగిల్చాయి. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు గాను చెన్నైలో తనకున్న రెండిళ్లను తెగనమ్మారని ఇండస్ట్రీలో టాక్. అయితే ఎవడైతే నాకేంటి సినిమా ఆయనను తిరిగి నిలబెట్టింది. ఈ మధ్యలో పీఎస్‌వీ గరుడ వేగ, కల్కి చిత్రాలతో రాజశేఖర్ ఇమేజ్‌ను నిలబెట్టుకున్నారు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?