Ram, Boyapati Srinu: పొలిటికల్ డ్రామా రామ్ కి సూట్ అవుతుందా..?

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు బోయపాటి శ్రీను. తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలు చేశారాయన. పొలిటికల్ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. ‘లెజెండ్’, ‘సరైనోడు’ సినిమాలు ఒకరకంగా పొలిటికల్ డ్రామాలే. ఇప్పుడు హీరో రామ్ తో ఓ సినిమా చేస్తున్నారు బోయపాటి శ్రీను. ఇది కూడా పూర్తిస్థాయి రాజకీయ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. రామ్ కి ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం ఇదే తొలిసారి.

ప్రస్తుత సమకాలీన రాజకీయాలు, జనం తరచూ మాట్లాడుకునే రాజకీయ వ్యవహారాలు, సంఘటనలు.. ఇవన్నీ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పొలిటికల్ పంచ్ లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట. దాంతో పాటు ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గెస్ట్ రోల్ లో నందమూరి బాలకృష్ణ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు దీనిపై బోయపాటి స్పందించలేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

అలానే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలే బోయపాటి.. ఓ భారీ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు వంద కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus