Ram Pothineni: రూ.50 కోట్లతో రిస్క్ చేస్తున్న రామ్!

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల విజయాలతో రామ్ పోతినేని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. తడమ్ రీమేక్ గా తెరకెక్కిన రెడ్ ఇస్మార్ట్ శంకర్ స్థాయిలో సక్సెస్ కాకపోయినా డ్యూయల్ రోల్ లో రామ్ ఆద్భుతంగా నటించాడనే పేరును తెచ్చిపెట్టింది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చుకోవాలని భావించి రామ్ కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. రామ్ తరువాత సినిమా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా కోసం రామ్ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ సినిమాకు రామ్ 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని దర్శకుడు లింగుస్వామి 6 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఆవారా తర్వాత ఆ స్థాయి హిట్ లేకపోయినా లింగుస్వామి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రామ్ లింగుస్వామి కాంబో మూవీ బడ్జెట్ 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం. ఇస్మార్ట్ హీరో రామ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

నిర్మాతలు ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా 25కోట్ల రూపాయల వరకు రావచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా రామ్ కు జోడీగా ఈ సినిమాలో కృతిశెట్టి నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో రిస్క్ చేస్తున్న రామ్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus