Ram pothineni :’ఇస్మార్ట్’ హీరో ప్రయత్నం.. జనాలు చూస్తారా..?

యంగ్ హీరోల్లో రామ్ కి ఉన్న క్రేజ్ వేరు. ఒకప్పుడు చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో ఎన్నో సినిమాల్లో నటించిన రామ్ ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దీంతో వరుసగా మాస్ కథలనే ఎన్నుకుంటున్నాడు. ఈ ఏడాది రామ్ నటించిన ‘రెడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఓకే అనిపించినా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ అవ్వలేకపోయింది.

ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్. లింగుస్వామి సినిమాలను గమనిస్తే.. ఆయన తన సినిమాల కోసం డిఫరెంట్ జోనర్లను ఎన్నుకుంటాడు. ఈసారి రామ్ కోసం ఫ్యాక్షన్ నేపథ్యంలో కథను రాసుకున్నాడని సమాచారం. ‘పందెంకోడి’ సినిమాతో లింగుస్వామికి కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పేరొచ్చింది. ఫ్యాక్షన్ కథలను బాగా డీల్ చేయగలడనే నమ్మకం వచ్చింది. ఆ తరువాత ‘పందెం కోడి 2’ తీశాడు. ఈ మధ్యలో ఫ్యాక్షన్ కథల జోలికి వెళ్లలేదు.

ఈసారి మాత్రం రామ్ కోసం అలాంటి జోనర్ ను సెట్ చేశాడు. తెలుగులో ఓ దశలో ఫ్యాక్షన్ కథలతో చాలా సినిమాలొచ్చాయి. ఈ జోనర్ లో ప్రతీ హీరో ఓ కథ చేసేసాడు. ఆ తరువాత ఫ్యాక్షన్ కథలపై బోర్ కొట్టింది. దీంతో ఆ జోనర్ జోలికి వెళ్లడం మానేశారు. ఇంతకాలానికి రామ్ అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి!

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus