‘పోలీసు కథ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. చాలా కథలు విన్నాను కానీ.. ఏదీ ఎక్కలేదు. ‘వారియర్’ సినిమా కథ విన్నాక.. ఈ సినిమా చేయాలని కచ్చితంగా అనుకున్నాను’’ – కొన్ని రోజుల క్రితం అంటే ‘వారియర్’ రిలీజ్‌కి ముందు రామ్ చెప్పిన మాట ఇది. మీరు కూడా ఈ మాట వినే ఉంటారు. అంతేకాదు రామ్ కాన్ఫిడెన్స్ చూసి.. ఈ సినిమాతో రామ్‌కి మరో విజయం పక్కా అని అనుకున్నారు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే.. తుస్ మంది.
అయితే, దీని గురించి తాజాగా ఓ టాక్ వినిపిస్తోంది. రామ్ చెప్పినట్లు తన దగ్గరకు వెళ్లి రిజక్ట్ చేసిన కథల్లో ఓ హిట్ సినిమా కూడా ఉందట. అది కూడా మామూలు హిట్ కాదు. రవితేజ కెరీర్‌ను భారీ మలుపు తిప్పిన సినిమా అదట. గోపీచంద్ మలినేనితో రవితేజ చేసిన ‘క్రాక్’ సినిమాను రామ్ రిజక్ట్ చేశాడు అని అంటున్నారు. కారణాలు తెలియవు కానీ.. ‘క్రాక్’ రామ్ దగ్గరకు వెళ్లి వెనక్కి వచ్చేసింది అంటున్నారు. ఒకవేళ ఈ సినిమా రామ్ చేసి ఉంటే.. అదిరిపోయేది అని చెప్పాలి.
రామ్ పోతినేని – గోపీచంద్ మలినేని కలసి అప్పటికే ఓ సినిమా చేశారు. ‘పండగ చేస్కో’ పేరుతో వచ్చిన ఆ సినిమా సరైన విజయం అందుకోలేకపోయింది. మరి ఆ సినిమా ఫలితం వల్లనో, ఇంకెందుకో కానీ ‘క్రాక్’ కథను రామ్ వదులుకున్నాడు. దీంతో ‘వారియర్’ సినిమా వరకు ఆగి దీనిని ఓకే చేశాడు. ‘క్రాక్’ కథ రామ్ దగ్గరకు మాత్రమే కాదు, ఇంకొందరు హీరోల దగ్గరకు కూడా వెళ్లింది. వాళ్లు కూడా నో చెప్పడంతో… రవితేజ వరకు వెళ్లింది.
తనకు అప్పటికే ‘బలుపు’, ‘డాన్ శీను’ వంటి విజయవంతమైన సినిమాలు అందించిన గోపీచంద్ మీద నమ్మకంలో రవితేజ ‘క్రాక్’ ఓకే చేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గోపీచంద్ మంచి విజయాన్ని అందించాడు. అందుకే ఓ సినిమా ఫలితంతో మరో కథను డిసైడ్ చేయకూడదు అంటారు. అర్థమవుతోందా?