Maanaadu: ‘మానాడు’ రీమేక్‌ హీరో మళ్లీ మారాడా?

శింబుకు కోలీవుడ్‌లో భారీ స్థాయిలో రీఎంట్రీ వచ్చిందంటే.. దానికి కారణం ‘మానాడు’. తెలుగులో ‘లూప్‌’ పేరుతో ఓటీటీలో వచ్చిన ఈ సినిమా శింబు కెరీర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌కు బాగా ఉపయోగపడింది అనే చెప్పాలి. సినిమా కూడా అదే స్థాయిలో సరికొత్తగా ఉంటుంది. అలాంటి సినిమాను తెలుగులో ఎవరు తీస్తారు అనే ప్రశ్న గత కొన్నేళ్లుగా వినిపిస్తోంది. దానికి కారణం.. అదిగో, ఇదిగో అంటూ ఆ సినిమా గురించి మాట్లాడటమే తప్ప క్లారిటీ లేదు.

ఇప్పటికే చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. తాజాగా మరో కొత్త పేరు లిస్ట్‌లోకి వచ్చింది. టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌లో సాగే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సగటు సినిమా హీరోకు, అభిమానులకు ఈ సినిమా నచ్చదు, నప్పదు. కానీ కాన్సెప్ట్‌ అదిరిపోతుంది. ఎవరు చేసినా వారి కెరీర్‌లో బెస్ట్‌ అనిపించుకుంటుంది. తాజాగా ఈ సినిమాలో నటిస్తోంది వీళ్లే అంటూ రెండు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఓ హీరో పేరు పాతది కాగా, రెండో హీరో పేరు చాలా కొత్తది కావడం గమనార్హం.

చాలా రోజులుగా ఈ సినిమాతో కనెక్టింగ్‌గా వినిపిస్తున్న హీరో రవితేజ. ఇప్పుడు ఆయన పేరుతోపాటు సిద్ధు జొన్నలగడ్డ పేరు కూడా వచ్చింది. ‘మానాడు’ సినిమాలో హీరో శింబు పాత్ర ఎంత ఫేమసో, విలన్‌ ఎస్‌.జె.సూర్య పాత్ర కూడా అంతే ఫేమస్‌. సూర్య పోషించిన పోలీసు పాత్రను రవితేజ చేస్తారని గతంలోనే వార్తలొచ్చాయి. ఇక శింబు పాత్రను సిద్ధు జొన్నలగడ్డ చేస్తారు అని తాజా సమాచారం. నిజానికి కొద్ది రోజుల క్రితం వరకు ఈ పాత్ర రానా చేస్తారని వార్తలొచ్చాయి.

అయితే ఏమైందో ఏమో ఇప్పుడు సిద్ధు ఆ ప్లేస్‌లోకి వచ్చాడు. ఈ కథను ప్రముఖ దర్శకులు హరీశ్‌ శంకర్‌, దశరథ్‌ తెలుగుకు తగ్గట్టుగా సిద్ధం చేస్తున్నారని ఆ మధ్య టాక్‌ నడిచింది. ఇప్పుడు దశరథ్‌ మాటల్లోనే ఈ సినిమా సమాచారం బయటకు వచ్చింది. త్వరలోనే ఫుల్‌ క్లారిటీ వస్తుందని కూడా ఆయన చెప్పారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus