టాలీవుడ్ హీరోలలో ఒకరైన సిద్దార్థ్ నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో తెలుగులో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు. అయితే సిద్దార్థ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సిద్దార్థ్ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న టికెట్ రేట్ల గురించి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. రెస్టారెంట్ కు ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీకి ఎంత వసూలు చేయాలో చెప్పరని సినీ పరిశ్రమను మాత్రం నిరంతరం సమస్యల్లో పడేస్తున్నారని సిద్దార్థ్ అన్నారు.
టికెట్ రేట్లు, షోల విషయంలో ఇచ్చిన జీవోలు మోనోపాలిస్టిక్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ ను ఉల్లంఘించినట్టేనని సిద్దార్థ్ పేర్కొన్నారు. సినిమాను, సినిమా హాళ్లను బ్రతకనివ్వాలని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు. 25 సంవత్సరాల క్రితం విదేశాలలో తాను సినిమా చూశానని అప్పుడు టికెట్ రేటు 8 డాలర్లు అంటే 200 రూపాయలు అని సిద్దార్థ్ పేర్కొన్నారు. ఇప్పుడు మీరు అంతకన్నా తక్కువ పెట్టారంటూ ఏపీ ప్రభుత్వం పేరు ఎత్తకుండా సిద్దార్థ్ కామెంట్లు చేశారు.
సినిమా ఇండస్ట్రీ ద్వారా చట్టబద్ధంగా లక్షల మందికి ఉపాధి లభిస్తోందని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు. సినిమాలు చూడాలని ఎవరూ ఎవరినీ బలవంతం చేయరని మేము మీ అంత గొప్పవాళ్లం కాకపోయినా మేము కూడా మనుషులమే అని సిద్దార్థ్ పేర్కొన్నారు. వినోదం, కళను పంచే మా జీవనోపాధిని చంపడం మానేయాలని సిద్దార్థ్ వెల్లడించారు. మేము అందరి కంటే ఎక్కువగా ట్యాక్స్ చెల్లిస్తున్నామని సిద్దార్థ్ పేర్కొన్నారు. సిద్దార్థ్ కామెంట్లపై ఏపీ రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
We work hard and put our livelihood on the line to entertain and create art. Stop killing the hand that tries to entertain. #SaveCinema
— Siddharth (@Actor_Siddharth) December 2, 2021
Most Recommended Video
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!