హీరో సిద్దార్థ్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ‘బాయ్స్’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సినిమాలు ఇప్పటికీ బుల్లితెర పై సందడి చేస్తూనే ఉన్నాయి. ఇక ‘బొమ్మరిల్లు’ చిత్రానికై కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. 10 ఏళ్ళ క్రితం వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ కూడా బాగానే ఆడింది. సినిమా ప్లాప్ అయినప్పటికీ ‘ఓయ్’ చిత్రానికి కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ సిద్దార్థ్ తో రూ.20 కోట్ల బడ్జెట్ లో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు.
కానీ సిద్దార్థ్ తమిళంలో తనకి నచ్చినట్టు సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మొహాన పడేస్తున్నాడు. 8 ఏళ్ళ తర్వాత ‘మహాసముద్రం’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఇంత కాదు .. అంత కాదు అంటూ ప్రమోషన్స్ టైంలో మోసేసాడు. అజయ్ భూపతి ఇండియాలోనే బెస్ట్ టెక్నిషియన్ అని, ‘మహాసముద్రం’ ఓ గేమ్ చేంజర్ మూవీ అవుతుందని చెప్పుకొచ్చాడు. కానీ కట్ చేస్తే ఆ సినిమాలో సిద్దార్థ్ చెప్పిన విషయమేమీ లేదు.
పైగా ఇది 10 ఏళ్ళ తర్వాత రావాల్సిన సినిమా అని కూడా కవర్ చేశాడు. రూ.8 కోట్ల పారితోషికానికి చూపిస్తున్న విశ్వాసం అది అనుకోవచ్చు. ఇక తాజాగా టక్కర్ సినిమా రిలీజ్ అయ్యింది. దీనికి కూడా ప్రమోషన్స్ లో సిద్దార్థ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇది కూడా బెస్ట్ మూవీ అంటూ ఏదేదో అనేశాడు. కానీ ఆ రేంజ్ లో సినిమా అస్సలు లేదు.
అప్పుడెప్పుడో వచ్చిన తరుణ్ అదృష్టం , కార్తీ ఆవారా వంటి సినిమాలను మిక్స్ చేసినట్టు ఉంటుంది ఈ సినిమా. సో సిద్దార్థ్ (Siddharth) ఇలాంటి కథలు ఎంపిక చేసుకుంటే హీరోగా ఇక ఎక్కువ కాలం ఉండడు అనే చెప్పాలి. అంందుకే అతనికి ప్రేమ కథలు , ఫ్యామిలీ కథలే బెటర్ అని కొందరు భావిస్తున్నారు.