సీనియర్ హీరో శివాజీ తెలుసు కదా. ‘అమ్మాయే బాగుంది’ ‘మిస్సమ్మ’ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. ‘ప్రియమైన నీకు’ వంటి సినిమాల్లో సెకండ్ హీరోగా చేశాడు. ‘ఇంద్ర’ ‘జల్సా’ వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. నితిన్, ఆర్యన్ రాజేష్.. వంటి హీరోలకు డబ్బింగ్ కూడా చెప్పాడు. అయితే సడన్ గా సినిమాలు మానేసి.. అప్పుడప్పుడు రాజకీయాల పట్ల కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గత ఎలక్షన్స్ కు ముందు ‘ఆపరేషన్ గరుడ’ అంటూ ఇతను చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఇతను పవన్ కళ్యాణ్ పై చేసిన కొన్ని కామెంట్లు పెద్ద చర్చనీయాంశం అయ్యాయి.
ఓ పక్క పవన్ గురించి పొగుడుతున్నట్టు చెబుతూ… చివర్లో పవన్ అభిమానులకు మండేలా ఇతను కామెంట్లు చేశాడు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ.. “జనసేనక ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. తగ్గడం పెరగడం అంటూ ఏమీ లేదు కానీ.. వాళ్లకు ఉన్న ఓటు బ్యాంకు వాళ్లకి ఉంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి.. జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో వాళ్ల ఉనికి చాటుకున్నారు. కొన్ని మున్సిపాలిటీలు కొట్టిన సందర్భాలు లేకపోలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓ శక్తి.. అతను అనుకుంటే ఏదైనా అయిపోతుంది. కానీ ఏదీ అనుకోడు.అనే ఇబ్బంది. అతను తలుచుకుంటే..
ప్రత్యేక హోదా అవుతుంది.. అమరావతి అవుతుంది.. విశాఖ ఉక్కు అవుతుంది. కానీ అతను ఎందుకు అనుకోడో నాకు అర్థం కాదు. ఆయన రోడ్డుపైకి వస్తే పార్టీలకు అతీతంగా వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుడు ఆయనకు ఆ ఆలోచన ఇస్తాడా అని ఎదురుచూస్తున్నాను. నాకు జనసేనలో పార్టీ చేరాలని ఆయనతో ఉండాలనేం లేదు. మన దగ్గర అస్త్రం ఉన్నప్పుడు.. దాన్ని కరెక్ట్‌గా ప్రయోగిస్తే దాని పవర్ ఏంటో తెలుస్తుంది. సరైన ప్లేస్‌లో సరైన టైంలో వాడటం లేదనేదే నా బాధ. బీజేపీతో కలవడం అనేది పూర్తిగా ఆయన ఇష్టం.
దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతివాడికీ ఉంటుంది. ఆయన నిర్ణయం ఆయనది.. తప్పుపట్టలేం. కానీ నా బాధ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి.. ఒక శక్తిగా పార్టీలను నమ్ముకునేకంటే.. ప్రజల పక్షాన సమస్యల్ని నమ్ముకుని ఫైట్ చేస్తే మాత్రం ఫలితం మరోలా ఉంటుంది.ఈ మాట జగన్ మోహన్ రెడ్డిగారి విషయంలో కూడా చెప్పాను. వైఎస్ జగన్.. వెరీ ఫోకస్డ్ పొలిటీషియన్. నాకు ఆ కుర్చీ కావాలంటే కావాల్సిందే. ఫోకస్ పెట్టాడంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాడు. పవన్ కళ్యాణ్ అలా ఫోకస్ పెట్టడం లేదు.
ఇద్దరికీ తేడా అదే.! నేను ఇలా మాట్లాడుతుంటే.. పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం రావచ్చు.. (Sivaji) ‘శివాజీ ఏంటి మాకు చెప్పేది’ అని ట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్‌ని నేను అలా చూడలేను. నేను పవన్‌ని విమర్శించడం లేదు.. ఆయన ఇది కాదు.. ఇంకా ఏదో ఉంది అనేది తెలుసుకున్న రోజున పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతారు. కానీ తెలుసుకోవడం లేదు.ఇది నిజం” అంటూ చెప్పుకొచ్చాడు.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!