Sree Vishnu: ప్రమోషన్ కోసం ఇలా అదిగజారాలా శ్రీవిష్ణు.. ఘోరం ఇది..!

నందమూరి బాలకృష్ణకి ఉన్న మాస్ ఇమేజ్… ‘లార్జర్ దేన్ లైఫ్’ అనడంలో అతిశయోక్తి లేదు. కానీ దీన్ని కరెక్ట్ గా వాడటంలో కొంతమంది దర్శకులు విఫలమయ్యారు. బాలయ్య కూడా మారు మాట్లాడకుండా దర్శకుడు ఏం చెప్తే అది చేసేసే రకం. అందుకే దశాబ్ద కాలం పాటు ఆయన ట్రోల్ మెటీరియల్ అయ్యాడు. కానీ ఇప్పుడు బాలయ్య ఒకప్పటి ఫామ్లో ఉన్నాడు అనేది వాస్తవం. ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్లతో బాలయ్య బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు.

ఇలాంటి టైంలో ఒకప్పుడు బాలయ్యని ట్రోల్ చేసిన విషయాలతో పాపులర్ అవ్వాలని కొంతమంది యంగ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. అది కేవలం తమ సినిమాల ప్రమోషనల్ కంటెంట్లను వైరల్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే..! ఈ లిస్ట్ లో శ్రీవిష్ణు కూడా చేరిపోయాడు. అతను హీరోగా ‘సామజవరగమన’ అనే సినిమా రూపొందింది. రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. రాజేష్ దందా నిర్మాత. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో హీరో ఎంతగానో ప్రేమించిన అమ్మాయి.. రాఖీ కట్టేస్తుంది.

అందువల్ల అతనికి ఐ లవ్ యు చెప్పిన ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించేసుకుంటూ ఉంటాడు. ఇలాంటి కుర్రాడు ఓ అమ్మాయితో ప్రేమలో పడితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది కథ అని టీజర్ ద్వారా చెప్పారు. అయితే టీజర్ చివర్లో బాలయ్య గతంలో ఫోన్లో ఓ అభిమానిని తిట్టిన సందర్భాన్ని తీసుకుని ఈ సినిమాలో స్పూఫ్ లా పెట్టారు. టీజర్ లో అదే హైలెట్ అయ్యింది. ఇది కేవలం తమ టీజర్ వైరల్ అయ్యేలా చేసుకోవడానికి చిత్ర బృందం చేసిన జిమ్మిక్కు వంటిది.

అయితే శ్రీవిష్ణుకి (Sree Vishnu) సాఫ్ట్ ఇమేజ్ ఉంది. అతని సినిమాలు ఆడినా… ఆడకపోయినా కొంత గౌరవాన్ని సంపాదించుకుంటాయి. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడు అనే నమ్మకం జనాల్లో ఉంది కాబట్టి.! కానీ అతను కూడా తన సినిమాల కంటెంట్ ను జనాల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియా ట్రోల్స్ ను వాడుకోవాలా? అది కూడా ఎప్పుడో బాలయ్య చిరాకుతో మాట్లాడిన ఆడియోని స్పూఫ్ చేసి..! పోనీ ఇలా అయినా అతను సక్సెస్ అవుతాడా? అనేది తెలియాల్సి ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus