Hero Suman: శ్రీవారి పాత్ర సుమన్‌ దాకా రావడానికి ఇంత కథ నడిచిందా..?

అన్నమయ్య.. తెలుగు నాట సినిమా థియేటర్లను తిరుమలగా మార్చిన చిత్రం. రోమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ స్టార్‌గా వున్న నాగార్జునలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా. మాస్ మసాలా సినిమాలు దున్నేస్తున్న సమయంలో ఏ కాలంలోనైనా మంచి చిత్రాలను ఆదరిస్తామని జనం నిరూపించిన మూవీ. ఇందులో కింగ్ అక్కినేని నాగార్జున నటనకు ఆంధ్రదేశం నీరజనాలు పట్టింది. అయితే అన్నమయ్యగా నటించిన నాగార్జునతో పాటు ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వరుడిగా నటించిన సుమన్‌ పాత్ర జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఎన్నో వివాదాలు, జైలు జీవితం తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సుమన్‌ వెంకన్నగా అలరించారు.

ఎన్టీఆర్ తర్వాత వెంకటేశ్వరుడి పాత్రలో గుర్తిండిపోయారు. అయితే ఈ క్యారెక్టర్ కోసం రాఘువేంద్రరావు ఇద్దరు అగ్రనటుల్ని సంప్రదించారట. సినిమాలో కొన్ని స‌న్నివేశాల్లో భ‌క్తుడైనా నాగార్జున.. వెంక‌టేశ్వ‌ర‌స్వామి పాత్ర‌ధారి పాదాల‌పై ప‌డాల్సిన స‌న్నివేశాలున్నాయి. అక్కినేని అభిమానుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా నాగార్జున కంటే అగ్రనటుడి చేత శ్రీవారి పాత్ర చేయించాలని రాఘవేంద్రరావు భావించారట.ముందుగా అలనాటి న‌టుడు శోభ‌న్‌బాబుని క‌లిశారు. అయితే అప్ప‌టికే శోభ‌న్‌బాబు సినిమాల నుంచి దాదాపుగా రిటైర్ అయిపోయారు. అయితే రాఘవేంద్రరావుకు నో చెప్పడం ఇష్టం లేక రూ.50 లక్షలు రెమ్యున‌రేష‌న్ ఇస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని శోభన్ అన్నారట.

ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అడిగితే వెన‌క్కి వెళ్లిపోతార‌నేది సోగ్గాడి ఆలోచన‌. ఆయన అనుకున్నట్లుగానే ద‌ర్శక నిర్మాత‌లు శోభ‌న్‌బాబుని వ‌ద్ద‌నుకున్నారు. త‌ర్వాత నందమూరి అందగాడు.. పౌరాణిక, జానపద చిత్రాల్లో అనుభవమున్న బాల‌కృష్ణ‌ను రాఘవేంద్రరావు సంప్రదించారట. అయితే ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు అవుతాయేమోన‌ని భయపడ్డ దర్శకేంద్రుడు. ఆ ఆలోచనను కూడా విరమించుకుని బాగా ఆలోచించారు. ఈ క్రమంలోనే సుమ‌న్ గుర్తుకువ‌చ్చాడు. సుమ‌న్ అప్పటికే సీనియ‌ర్ యాక్ట‌ర్‌ కావ‌డం, మాస్ ఫాలోయింగ్ వుండటంతో ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌ద‌ని రాఘ‌వేంద్రరావు భావించారు. అనుకున్నదే తడవుగా సుమన్‌ని పిలిపించి ఫొటో షూట్ చేయించారు. ఆయనకు శ్రీవారి గెటప్ సూట్ కావడంతో చివరకు సుమన్ వెంకటేశ్వరుడి పాత్రలో నటించి మెప్పించారు

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus