పూరి చెప్పిన కథకి నో చెప్పిన సుమంత్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ రూపొందించిన ‘దేశముదురు’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా బన్నీ కెరీర్ కి ఎంతో హెల్ప్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా సుమంత్ ని తీసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని సుమంత్ స్వయంగా వెల్లడించారు. ‘దేశముదురు’ సినిమా కథ ముందుగా తన దగ్గరకే వచ్చిందని.. అయితే తన బాడీ లాంగ్వేజ్ కి ఆ కథ సెట్ అవ్వదని సుమంత్ తిరస్కరించాడట.

‘దేశముదురు’ సినిమా గనుక తను చేసి ఉంటే.. అది అట్టర్ ప్లాప్ అయ్యేదని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. నటుడిగా చాలా కథలు వింటుంటానని.. అయితే అన్ని కథలకు సూట్ అవుతానని అనుకోనని.. నెరేషన్ ఇచ్చిన కొద్దిసేపటికే సినిమా తనకు సూట్ అవుతుందో లేదో క్లారిటీ వచ్చేస్తుందని.. ఒకవేళ కథ తనకు సూట్ అవ్వకపోతే.. ఎవరికి సూట్ అవుతుందో వారి దగ్గరకి ఆ కథను వినమని పంపిస్తానని అన్నారు. ఇలా కథల విషయంలో తన క్లారిటీని బయటపెట్టాడు.

నిజానికి ‘మళ్లీరావా’ సినిమా తరువాత అదే తరహాలో రొమాంటిక్ కథలు వస్తాయని ఊహించానని కానీ ఆశ్చర్యంగా థ్రిల్లర్ కథలు రావడం మొదలయ్యాయని చెప్పుకొచ్చాడు. ఈ హీరో నటించిన ‘కపటధారి’ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus