Suriya: అవార్డులన్నీ ఆ మూడు సినిమాలకే!

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ తెలుగులో అల్లు అర్జున్‌ సత్తా చాటితే.. తమిళంలో బన్నీ ఫేవరెట్‌ హీరో సూర్యదే హవా. 2020 – 2021 మధ్యలో సూర్య నుండి వచ్చిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల పంట పండింది. ప్రేక్షకుల నుండి ఆదరాభిమానాలు సంపాదించిన ఆ చిత్రాల్లో ఒకదానికి ఏకంగా జాతీయ పురస్కారమే వచ్చింది. మరో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకోలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కాకుండా అవార్డులు సాధించిన చిత్రం అంటే ‘సార్పట్ట’నే.

సూర్య కెరీర్‌లో హిట్‌ సినిమాలు చాలానే ఇచ్చాడు. అయితే మనసు నిండిన సినిమాలు మాత్రం గత రెండేళ్లలో చాలానే ఇచ్చాడు. అలాంటి వాటిలో ‘సూరారైపోట్రు’, ‘జై భీమ్‌’. రెండూ డిఫరెంట్‌ కథలు. మొదటి దాంట్లో హీరోయిజం కనిపించినా, రెండో దాంట్లో కథ మాత్రమే ఉంటుంది. సూర్య ఆ పాత్రలో జీవించాడు అంతే. తొలి సినిమాలోనూ సూర్య తనదైన నటనతో ఓసారి కన్నీళ్లు, ఓసారి నవ్వులు మరోసారి ఏదైనా సాధించాలనే తపన అందించాడు.

ఇదీ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్న తమిళ సినిమాల లిస్ట్‌
• ఉత్తమ చిత్రం: జై భీమ్‌
• ఉత్తమ దర్శకురాలు: సుధా కొంగర (సూరారైపోట్రు)
• ఉత్తమ నటుడు: సూర్య (సూరారైపోట్రు)
• ఉత్తమ నటి: లిజోమోల్‌ జోసీ (జై భీమ్‌)
• ఉత్తమ సహాయ నటుడు : పశుపతి (సార్పట్ట)
• ఉత్తమ సహాయనటుడు: ఊర్వశి (సూరారైపోట్రు)
• ఉత్తమ ఆల్బమ్‌: జీవీ ప్రకాశ్‌ (సూరారైపోట్రు)
• ఉత్తమ గేయ రచయిత‌: అరివు (నీయే ఒలి… – సార్పట్ట)
• ఉత్తమ గాయకుడు: క్రిస్టిన్‌ జాస్‌, గోవింద్‌ వసంత (ఆగాశం.. — సూరారైపోట్రు)
• ఉత్తమ గాయని : ధీ (కాటు పయలే.. – సూరారైపోట్రు)
• ఉత్తమ కొరియోగ్రాఫర్‌: దినేష్‌ కుమార్‌ (వాతి కమింగ్‌.. – మాస్టర్‌)
• ఉత్తమ సినిమాటోగ్రఫీ: నికిత్‌ (సూరారైపోట్రు)

ఇదే వేదికపై మొత్తం సౌత్‌కి గాను లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. దివంగత కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డులు అందించారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus