Hero Suriya: ఆవుని తోలుకెళ్తున్న సూర్య.. వైరల్ అవుతున్న వీడియో..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సింప్లిసిటీ గురించి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎక్కువగా జనాలకి తెలిసుండదు.ఇలాంటి విషయాలను అసలు పైకి ప్రచారం చేసుకోరు సూర్య. ఆయన భార్య జ్యోతిక కూడా తన సినిమాలకి వచ్చే పారితోషికాన్ని సగానికి పైనే సేవా కార్యక్రమాలకి ఖర్చు పెడుతూ ఉంటుంది. సినిమాల్లో ఎంత మేన్లీగా కనిపించినా..రియల్ లైఫ్ లో మాత్రం సూర్య చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. ఇలా ఎంతో మందికి మాదిరిగా నిలుస్తుంటారు సూర్య.

Click Here To Watch NOW

తాజాగా సూర్య ఓ ఆవుని తోలుకెళ్తు కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రియల్ లైఫ్ లో కూడా సూర్యకి ఓ ఫామ్ వుంది. ఆ ఫామ్‌కి చెందిన ఆవునే సూర్య తీసుకెళ్తున్నారు. ఆవుని తోలుకెళ్తున్న టైములో సూర్య చాలా సింపుల్ గా కనిపించారు. ఒక షాట్, బనియన్ మాత్రమే ఆయన ధరించారు. సూర్యకి నిజజీవితంలో సింపుల్ గా ఉండడమే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఆయన ఖాళీ సమయంలో ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలను చదువుతూ పొలంలో ప్రాక్టికల్స్ చేస్తుంటారు. సూర్య ఉన్నత చదువులు చదువుకున్న వారే, ఆయనకి కోట్లల్లో పారితోషికం అందుతుంది.కానీ ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమా చేయరు. సూర్య నటించాడు అంటే కచ్చితంగా ఆ సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని చాలామంది నమ్ముతుంటారు. ఈయన తమ్ముడు కార్తీ కూడా అంతే..! ఇక ఇటీవల ‘ఈటి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. దీని తర్వాత బాల దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఆయన రెడీ అయ్యారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus