Mahesh Babu, Tarun: ఆ సూపర్ హిట్ సినిమాని కూడా మహేష్ మిస్ చేసుకున్నాడట..!

  • May 30, 2021 / 07:21 PM IST

మహేష్ బాబుని స్టార్ హీరోని చేసిన చిత్రం ‘ఒక్కడు’. ఇది 2003 లో విడుదలైంది. అయితే 2002 వ సంవత్సరం నాటికి మహేష్ ఇంకా స్టార్ స్టేటస్ ను సంపాదించుకోలేదు. అతనికంటే ఉదయ్ కిరణ్,తరుణ్ వంటి హీరోలు టాప్ ప్లేస్ లో ఉండేవారు.అందుకే సూపర్ హిట్ సినిమాలు అన్నీ వాళ్ళ వద్దకే వెళ్ళేవి. సరే ఇక అసలు విషయం ఏంటంటే.. తరుణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ‘నువ్వు లేక నేను లేను’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. 2002 వ సంవత్సరం జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలైంది.

అంతేకాదు సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది. పోటీగా మహేష్ బాబు ‘టక్కరి దొంగ’ సినిమా కూడా విడుదలైనా.. అది ఫ్లాప్ అయ్యింది. అయితే ‘నువ్వు లేక నేను లేను’ సినిమా మహేష్ చేసుంటే ఎలా ఉండేదంటారు? ఆ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు కావస్తోంది. ఇప్పుడు ఇదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? నిజానికి ఈ చిత్రాన్ని ‘మహేష్ తో చేద్దామా’ అని నిర్మాత సురేష్ బాబే అడిగారట. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న కాశీ విశ్వనాథ్ గారే ‘నువ్వు లేక నేను లేను’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

అయితే మొదట ఆయన ఈ కథని రెడీ చేసుకుని నిర్మాత సురేష్ బాబుకి వినిపించినప్పుడు.. ‘మహేష్ తో చేద్దామా’ అని అడిగారట. అందుకు కాశీ విశ్వనాథ్ గారు.. ‘మహేష్ తో చెయ్యడం అంటే చాలా టైం పట్టేస్తుంది. అతనికి కథ చెప్పాలంటేనే చాలా మంది దర్శకులను దాటుకుని వెళ్ళాలి. అంత లైన్ ఉంటుంది. నేను రాసుకున్న కథ తరుణ్ కు బాగా సెట్ అవుతుంది. పైగా ‘నువ్వే కావాలి’ ‘ప్రియమైన నీకు’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి అతను కూడా ఫామ్లో ఉన్నాడు’ అంటూ తరుణ్ ని ఫైనల్ చేయమని కోరాడట. దాంతో మరో సూపర్ హిట్ మహేష్.. మిస్ అయినట్లు అయ్యింది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus