టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా క్రేజ్ అందుకున్న తరుణ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాల నటుడిగా సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న తరుణ్ ఆ తరువాత టీనేజ్ వయసు దాటగానే నువ్వే కావాలి అంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ సినిమా తరువాత తరుణ్ కు ఒక్కసారిగా ఆఫర్ల వర్షం కురిసింది. గ్యాప్ లేకుండా పదుల సంఖ్యలో ఆఫర్స్ వచ్చాయి.
నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను.. వంటి లవ్ స్టొరీలతో పరవాలేదు అనిపించిన తరుణ్ మంచి హీరోగానే సెట్టవుతాడాని అంతా అనుకున్నారు. కానీ సక్సెస్ ను ఎక్కువరోజులు కొనసాగించకపోవడంతో మెల్లగా ప్రేక్షకులకు దూరం అయ్యాడు. చివరగా 2017లో ఇది నా లవ్ స్టోరి అనే సినిమా అనంతరం మళ్ళీ కనిపించలేదు. అయితే తరుణ్ మనసులో ఇంకా సినిమాపై ఏ మాత్రం మక్కువ తగ్గలేదు అనిపిస్తోంది. ఇటీవల మలయాళం హిట్ మూవీ అతిరన్ ఆహా యాప్ లో తెలుగులో విడుదలవ్వగా అందులో ఫాహద్ ఫాజిల్ నటించిన ప్రధాన పాత్రకు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు.
ఒక సినిమా ఆర్టిస్టుగా స్థాయిని లెక్క చేయకుండా తరుణ్ తీసుకున్న నిర్ణయం సాహసమనే చెప్పాలి. ఇది అతనికి మంచి పనే అయినప్పటికీ తరుణ్ మరీ ఈ స్థాయిలోకి వచ్చేశాడా? అనే కామెంట్స్ రాకుండా ఉండవు. హీరోగా రావాలని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి తరుణ్ రానున్న రోజుల్లో ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!