ఆ సీన్ పై అందరూ జోకులేసుకుంటున్నారు.. కానీ!

మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచేసింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం ఓ రేంజ్ లో జరుగుతోంది. తన కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో విలన్.. హీరో పురుషాంగాన్ని కత్తిరిస్తాడని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా.. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పరోక్షంగా ప్రస్తావించారు.

క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో వైష్ణవ్ తేజ్ స్వయంగా క్లైమాక్స్ ఎపిసోడ్ పై స్పందించారు. క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోందని.. కానీ అందులో పూర్తి నిజం లేదని అన్నారు. సినిమా చూస్తే అందరికీ అర్ధమవుతుందని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు క్లైమాక్స్ గురించి తప్పుడు ప్రచారం జరుగుతుందని.. కొంతమంది దేనిని ఫన్నీగా చూస్తున్నారని.. కానీ సినిమా చూసిన తరువాత ఆ సన్నివేశంలో లోతు, అంతరార్ధం తెలుస్తుందని అన్నారు.

అంతేకాదు.. ఆ సీన్ దగ్గరే ‘ఉప్పెన’ అనే టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి వైష్ణవ్ తేజ్ సినిమా క్లైమాక్స్ దుఃఖాంతం అనే విషయాన్ని చెప్పేశాడు. మరి ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus