తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి ప్రస్తుతం రాజకీయపరంగా చాలా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే జులై 11వ తేదీ విజయ్ చెన్నై పనయూర్ ఆఫీస్ లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ సభ్యులను కలిశారు.విజయ్ మక్కల్ ఇయక్కమ్(VMI) సభ్యులతో తరచుగా భేటీ కావడంతో పొలిటికల్ ఊహాగానాలకు బలం చేకూరుతుంది. తాజాగా జరిగిన సమావేశంలో భాగంగా విజయ్ ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. సీఎం సీటునే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఈయన రాజకీయ పరిధిలోకి దిగబోతున్నట్లు సమాచారం
ఈ క్రమంలోనే 2026 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని ఈ ఎన్నికలను టార్గెట్ చేసి ఈయన రాజకీయాల్లోకి రాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో పోటీ చేసి గెలవాలి అంటే ఇప్పటి నుంచే ప్రజలలోకి వెళ్లాల్సి ఉంటుందని భావించిన విజయ్ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ విధంగా తాను నటించిన లియో సినిమా విడుదలకు ముందే ఈయన పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం
అయితే ఏకధాటిగా పాదయాత్ర చేయకుండా దశలవారీగా రాష్ట్రంలో పలు నియోజకవర్గాలలో పర్యటించి ప్రజల ఇబ్బందులను స్వయంగా చూసి తమ ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించబోతున్నారని తెలుస్తోంది. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారనే సెంటిమెంట్ అందరిలోనూ ఉంది. ఈ క్రమంలోనే అదే సెంటిమెంట్ విజయ్ కూడా అనుసరిస్తున్నారని సమాచారం. ఈ విధంగా సినిమా అక్టోబర్ నెలలో విడుదల కానుంది అంతలోపే ఈయన ఒక దశ పాదయాత్రను పూర్తి చేయబోతున్నట్లు సమాచారం.
ఇక సినిమాల విషయానికొస్తే ఈ సినిమా తర్వాత ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యారు బహుశా ఇదే ఈయనకు ఆఖరి సినిమా అవుతుందని తెలుస్తుంది ఈ సినిమా అనంతరం పూర్తి రాజకీయాలలోకి వెళ్లబోతున్నారట విజయ్ పాదయాత్ర చేయబోతున్నారంటూ వార్తలు వచ్చిన ఇంకా ఈ విషయం గురించి విజయ్ (Vijay) అధికారకంగా ప్రకటించలేదు.