Mahesh Babu, Vikram: మహేష్ సినిమాలో విక్రమ్.. క్లారిటీ ఇచ్చేశారు!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త కాంబినేషన్స్ తెరకెక్కుతున్నాయి. హీరోలు కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి చాలా ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కూడా కొంతమంది హీరోలు విలన్స్ గా కూడా నటిస్తున్నారు. అయితే మహేష్ బాబు సినిమాలో కూడా ఒక తమిళ హీరో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు గత కొన్ని నెలలుగా అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

Click Here To Watch

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 28వ సినిమాతో బిజీ కానున్నాడు. అయితే ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా కొంత మంది ప్రముఖ నటీనటులను కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫైనల్ చేసేసాడు. ఇక సెకండ్ హీరోయిన్ కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన పాత్ర కోసం హీరో విక్రమ్ ను సంప్రదించినట్లు గా సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి.

అయితే ఇది నిజం అని అందరూ అనుకున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని ఇటీవల విక్రమ్ కు సంబంధించిన మేనేజర్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. వార్తలు రాసే ముందు సంప్రదించి ఉంటే ఈ విషయంలో క్లారిటీ గా ఉండేది అని నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని కూడా వారు వివరణ ఇచ్చారు. దీంతో మహేష్ బాబు సినిమాలో విక్రమ్ లేనట్లుగా అభిమానులకు ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది.

ఇక ఈ సినిమాకు అందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టే వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ సినిమా అనంతరం మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus