కెజిఎఫ్ డైరెక్టర్ శిష్యుడిని లైన్ పెట్టిన హీరో యష్

కెజిఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన హీరో యష్ పాన్ ఇండియా స్టార్ ఐపోయాడు . ఆయనకు ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రాఖీ భాయ్ గా యష్ హీరోయిజం, యాక్షన్ ఆయనకు అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేశాయి. భాషా బేధాలు లేకుండా అన్ని భాషలలో కెజిఎఫ్ ఘన విజయం అందుకుంది. కాగా ఈ మూవీకి కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తి కాగా ఓ 20రోజుల షూటింగ్ మిగిలివుంది.

దీనితో త్వరలో ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ప్రకటించిన విధంగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నారు. మరి ఈ క్రేజీ స్టార్ నెక్స్ట్ మూవీ ఏమిటనే ఆసక్తి ఫ్యాన్స్ తో పాటు అందరు సినీ ప్రేమికులలో నెలకొని ఉంది. కాగా యష్ తదుపరి చిత్రంపై అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఓ యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వనున్నాడట. కన్నడ డైరెక్టర్ నార్తన్ తో ఆయన తన నెక్స్ట్ మూవీ కమిటైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే వీరి మధ్య చర్చలు జరుగగా యష్ స్క్రిప్టు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడట. మరి ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే 2021లో సెట్స్ పైకి వెళుతుంది. ఇక 2017లో వచ్చిన మఫ్టీ చిత్రానికి నార్తన్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే నార్తన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

Most Recommended Video

ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus