టైటిల్స్ లో వింటేజ్ లుక్ ఇష్టపడుతున్న హీరోలు

  • June 19, 2017 / 10:46 AM IST

తెలుగు కంటే ఇంగ్లిష్ వాడకం ఎక్కువైపోతుండడంతో నేటి సినిమాలకు టైటిల్స్ ఇంగ్లిష్ లో పెట్టడం పెరిగిపోయింది. తెలుగు భాషనీ పరిరక్షించాలని అందరూ కోరడంతో నేటి దర్శకులు, హీరోలు ఈ మధ్య సినిమాలను తెలుగు పేర్లే పెడుతున్నారు. స్టార్ హీరోలు ఇంకొంచెం వెనక్కి వెళ్లి తెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళ్లలో వచ్చిన సినిమా పేర్లను ఇప్పటి సినిమాలకు పెట్టుకుంటున్నారు. అటువంటి సినిమా టైటిల్స్ పై ఫోకస్…

జై లవ కుశ ఇప్పటివరకు 26 చిత్రాలు చేసిన ఎన్టీఆర్ ఒకటి, రెండు మినహా అన్నింటికీ తెలుగు పేర్లే పెట్టారు. అది తెలుగు భాషపై తారక్ కి ఉన్న అభిమానానికి నిదర్శనం. ఇక తన 27 వ చిత్రానికి ఏకకంగా 50 ఏళ్ళ వెనక్కి వెళ్లారు. జై లవకుశ అని టైటిల్ పెట్టారు. అంతేకాదు లోగో డిజైన్ లో వింటేజ్ లుక్ తీసుకొచ్చారు.

మరకతమణి ఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మరకతమణి. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ పేరు వాడకాన్ని ఎప్పుడో తగ్గించారు. మరుగున పడిపోయిన ఈ రత్నాల పేరుని తమ సినిమాకి పెట్టి మళ్లీ పాపులర్ చేశారు.

రంగ స్థలం యువ హీరోలు పదేళ్లు అడ్వాన్స్ గా ఆలోచిస్తుంటే రామ్ చరణ్ తేజ్ మాత్రం పాతికేళ్లు వెనక్కి వెళ్లారు. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి “రంగస్థలం” అనే టైటిల్ పెట్టారు. ఈ లోగో డిజైన్ కూడా ఆనాటి రోజుల్ని గుర్తుకు తెస్తోంది.

జయ జానకి నాయకబోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న సినిమాకి కూడా అలనాటి పేరును సూచించారు. రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రానికి “జయ జానకి నాయక” పేరుని ప్రకటించి టైటిల్ తోనే అందరినీ ఆకర్షించారు.

విఠలాచార్యతెలుగు వెండితెరపై అద్భుతాలు సృష్టించిన దర్శకుడు విఠలాచార్య. అతని పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అలనాటి హీరో నరేష్, అతని తనయుడు నవీన్ విజయ కృష్ణ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాని సుహాస్ మీరా దర్శకత్వం వహిస్తున్నారు.

కాలాపా.రంజిత్‌ దర్శకత్వంలో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం ‘కాలా’. ఈ పేరు కూడా ఇప్పటిది కాదు. యాభై ఏళ్ళ క్రితం నాటిది. తమిళనాడులో అరవైయేళ్ల క్రితం ప్రాచుర్యం పొందిన ఈ పేరు రజనీ ద్వారా మళ్ళీ బయటికి వచ్చింది.

మహానటి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటి సావిత్రి. ఆమె జీవితగాథపై తెరకెక్కుతోన్న సినిమాకు మహానటి అని పేరును ఖరారు చేశారు. పేరుతో పాటు ప్రీ లుక్ పోస్టర్ కూడా వింటేజ్ లుక్ తో ఆకట్టుకుంది.

మేడ మీద అబ్బాయి వరుస అపజయాలతో సతమతమవుతున్న అల్లరి నరేష్ చేస్తున్న తాజా చిత్రం “మేడ మీద అబ్బాయి”. టైటిల్ తో పాటు జూన్ 10 న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కూడా పాతకాలపు లుక్ ని సొంతం చేసుకుంది.

భాగమతిబాహుబలి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా భాగమతి. ఈ పేరుకు కూడా నాలుగువందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆ టైటిల్ లోగో ఎలావుంటోందో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus