హిట్లు ఇస్తున్నా.. హీరోలు సెట్ అవ్వడం లేదు!

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు వెంకీ కుడుముల. మొదటి సినిమాతోనే మంచి హిట్టు అందుకున్నాడు. హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ డైరెక్టర్ కి మరో సినిమా అనౌన్స్ చేయడానికి చాలా సమయం పట్టింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత నితిన్ హీరోగా ‘భీష్మ’ సినిమా తీశాడు. ఈ సినిమా ఊహించిన దానికంటే పెద్ద హిట్ అవ్వడంతో వెంకీకి వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వెంకీ తన తదుపరి సినిమా చేయాల్సి ఉండడంతో.. స్టార్ హీరోల పేర్లు వినిపించాయి.

రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో వెంకీ కుడుముల సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ ఇద్దరు హీరోలు వెంకీకి డేట్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా శంకర్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో చేయబోతున్నాడు. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరి కూడా లైన్లో ఉన్నాడు. దీని బట్టి ఆయన ఎప్పుడు ఫ్రీ అవుతాడో చెప్పలేని పరిస్థితి.

పోనీ మహేష్ తో సినిమా చేద్దామా అంటే.. ఆయన ‘సర్కారు వారి పాట’ పూర్తి చేసాక అనీల్ రావిపూడితో సినిమా చేయాలనుకుంటున్నాడు. అలానే త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తోంది. కాబట్టి మహేష్ బాబు కోసం కూడా ఇంకొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు. దీంతో వెంకీ కుడుముల మరోసారి మీడియం రేంజ్ హీరోతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు. నితిన్ తోనే నెక్స్ట్ సినిమా కూడా చేస్తాడని టాక్. అయితే అది నితిన్ సొంత బ్యానర్ లో ఉంటుందని అంటున్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus