బాడీ చూపించి సూపర్ హిట్స్ కొడతారా..?

టాలీవుడ్ లో బాలీవుడ్ తరహాగా బేర్ బాడీ చూపించడం అనేది చాలా కామన్ అయిపోయింది. సీనియర్ హీరోల నుంచి కుర్రహీరోల వరకూ జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేసి బాడీ పెంచడం, తమ సిక్స్ ప్యాక్ ని చూపించడం అనేది తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతోంది. కొమరం భీమ్ , అల్లూరి సీతారామరాజు లుక్స్ లో ఇద్దరు హీరోలు తమ ఫిజిక్ ని చూపించి మెస్మరైజ్ చేశారు. ట్రిబుల్ ఆర్ సినిమాలు రామరాజు లుక్ లో రామ్ చరణ్ తేజ్ తన బాడీని చూపించి మెప్పిస్తే, తర్వాత భీమ్ గా పులిని వేటాడి కండలు తిరిగిన బాడీని జూనియర్ ఎన్టీఆర్ చూపించాడు. ఈ రెండు టీజర్స్ కూడా యూట్యూబ్ ని షేక్ చేశాయి.

ఇక మేమేం తక్కువ తినలేదు అంటూ కుర్రహీరోలు సైతం తమ ఫిజిక్ ని చూపిస్తూ తమ ట్రైలర్స్ ని టీజర్స్ ని చూపించేస్తున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి గా ఎప్పుడైతే ఇలా షర్ట్ విప్పి మరీ చూపించాడో అప్పట్నుంచీ కుర్రహీరోలు సైతం ఇదే బాడీ లాంగ్వేజ్ ని ఫాలో అయిపోతున్నారనే చెప్పాలి. రీసంట్ గా విడుదల అయిన ఎ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో సందీప్ కిషన్ అస్సలు నమ్మశక్యం కానంత సన్నగా అయ్యాడు. క్యారెక్టర్ కోసం హాకీ నేర్చుకుని మరీ వర్కౌట్స్ చేసి తను ఎంత కష్టజీవో మరోసారి చూపించాడు. ఇక హీరో నాగశౌర్య లక్ష్య అంటూ సిక్స్ ప్యాక్ తో దుమ్మురేపాడు.

ఈ ఇద్దరు హీరోలు కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలనే ఎంచుకున్నారు. మరోవైపు లైగర్ అంటూ బాక్సింగ్ నేపథ్యంలో ఇదే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథని ఎంచుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఇంకా ఈ సినిమా టీజర్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి షర్ట్ విప్పి కండలు చూపిస్తాడా లేదా అనేది తెలియదు. బాక్సింగ్ అంటే ఖచ్చితంగా పంచ్ పవర్ , బైసప్స్ చూపించాలి కాబట్టి టీజర్ లో విజయ్ షర్ట్ లేకుండానే కనిపిస్తాడు నో డౌట్. మరి రాబోతున్న తమ సినిమాల్లో చొక్కాలు విప్పుతున్న మన హీరోలు సూపర్ హిట్స్ కొడతారా లేదా అనేది చూడాలి.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus