తెలుగు హీరోలు తమకి సూటయ్యే కథలను ఎంచుకుంటారని పక్క రాష్ట్రాల సినీ విమర్శకులు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలను నేటి హీరోలు తిప్పికొడుతున్నారు. పాత్రకు తగ్గట్టు మారిపోయి ఔరా అనిపిస్తున్నారు. భాషాబేధం లేకుండా అందరినీ మెప్పించి విజయాలను అందుకుంటున్నారు. అభినందించతగ్గ పాత్రలు చేసిన హీరోలపై ఫోకస్..
ప్రభాస్ (బాహుబలి)బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ తన శరీరాన్ని చెక్కిన గ్రీకు శిల్పంలా మార్చుకున్నారు. ఆ బాడీ చెక్కుచెదరకుండా ఐదేళ్లపాటు నోరు కట్టుకొని, నిరంతరం వ్యాయామం చేస్తూ ఇండియన్ స్టార్ గా కీర్తి అందుకున్నారు.
రవితేజ (పవర్)రవితేజ బాబీ దర్శకత్వంలో చేసిన పవర్ సినిమా కోసం రెండు వేరియేషన్స్ కనబరిచారు. ఒక రోల్ ఫిట్ గా కనిపిస్తే.. మరో రోల్ కోసం కొంచెం బరువు పెరిగారు.
ఎన్టీఆర్ (యమదొంగ, నాన్నకు ప్రేమతో) రాఖీ సినిమాలో ఎన్టీఆర్ ని యమదొంగలో ఎన్టీఆర్ ని అసలు మ్యాచ్ చేయలేము. డిఫెరెంట్ గా ఉంటారు. అలాగే నాన్నకు ప్రేమతో తో ఈ రెండు లుక్ కి విభిన్నంగా ఉంటుంది. ఇలా పాత్ర కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా ఎన్టీఆర్ రెడీ అవుతారు.
నాని (జెంటిల్ మ్యాన్)నేచురల్ స్టార్ నాని పెద్దగా మేకప్ జోలికి వెళ్లరు. అలాగే బాడీ తో ప్రయోగాలు చెయ్యరు. డిఫెరెంట్ నటనకి కళ్ళజోడు జోడించి జెంటిల్ మ్యాన్ సినిమాలో రెండు వేరియేషన్స్ చూపించారు.
రానా (లీడర్, కృష్ణం వందే జగద్గురుమ్, బాహుబలి)విజయం కావాలని తపనతో రానా చేసిన కృషి అందరి కళ్ళముందు కనబడింది. లీడర్, కృష్ణం వందే జగద్గురుమ్, బాహుబలి.. చిత్రాల్లో అతని చూస్తే ఆ కష్టం స్పష్టంగా తెలుస్తుంది.
నాగార్జున (ఢమరుకం)టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఫిట్ గా ఉంటూ పాతికేళ్లుగా బాడీ ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్న నాగ్ డమరుకం కోసం సిక్స్ ప్యాక్ రప్పించారు. ఆ ఏజ్ లో సిక్స్ ప్యాక్ రప్పించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
అల్లు అర్జున్ (దేశముదురు)అప్పటి వరకు బాలీవుడ్ కే పరిమితమైన సిక్స్ ప్యాక్ ట్రెండ్ ని టాలీవుడ్ లో అల్లు అర్జున్ సృష్టించారు. దేశముదురు సినిమాలో తన బాడీతో తెలుగు హీరోలు కూడా ముదుర్లే అని నిరూపించారు.
పవన్ కళ్యాణ్ (జానీ )ఖుషి వరకు పవన్ కళ్యాణ్ ఒక రకంగా కనిపిస్తే జూనీ లో మరోరకంగా ఉంటారు. క్లబ్ ఫైటర్, మార్షల్ ఆర్ట్స్ కోచ్ ఎలా ఉంటారో అలా మారిపోయారు. పాత్రకు తగ్గట్టుగా సిద్దమయ్యారు.