తెలుగమ్మాయిలపై ఆ ముద్ర ఎందుకు వేస్తారో..?

షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ సినిమా ఇండీస్ట్రీలో ఆమెకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. హీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. పెద్ద సినిమాల్లో చేసిన సైడ్ రోల్స్ కూడా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అయితే ఫైనల్ గా ‘కలర్ ఫోటో’ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకుంది. ఇటీవల ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ బ్యూటీకి పేరున్న ప్రాజెక్ట్ లలో నటించే అవకాశాలు వస్తున్నాయి.

సుధీర్ వర్మ రూపొందిస్తోన్న ‘సూపర్ ఓవర్’ అలానే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ గామి’ లాంటి చిత్రాల్లో చాందినికి అవకాశాలు వచ్చాయి. గతంలో ఈ బ్యూటీ చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాల రేంజ్ కాస్త ఎక్కువే. తాజాగా చాందిని చౌదరి నటించిన ‘బొంబాట్‌’ సినిమా ఓటీటీలో రిలీజయింది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. తనకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని.. ఎన్నో సార్లు వచ్చిన అవకాశాలు చేజారాయని.. ఒకానొక దశలో ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నానని.. కానీ తట్టుకొని నిలబడ్డానని చెప్పుకొచ్చింది.

తెలుగమ్మాయిలు అన్ని రకాల పాత్రలు పోషించలేరని దర్శకనిర్మాతలకు ఓ అపోహ ఉందని.. కానీ అది నిజం కాదని అన్నారు. బయట భాషల నుండి వచ్చే హీరోయిన్లలో ఎక్స్ పోజింగ్ కి, మోడ్రన్ డ్రెస్ లు వేసుకోవడానికి నో చెప్పేవాళ్లు ఉన్నారని.. కానీ ఆ ముద్ర తెలుగమ్మాయిలకే ఎందుకో వేస్తారో అర్ధం కావడం లేదని అన్నారు. అందం, అభినయంలో బయట హీరోయిన్లతో పోలిస్తే తెలుగమ్మాయి ఏమాత్రం తీసిపోరని చెప్పుకొచ్చింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus