పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే హిట్ టాక్ వచ్చిన వకీల్ సాబ్ సినిమాకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక షోలకు అనుమతులు లభిస్తే ఏపీలో మాత్రం ప్రత్యేక షోలకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. మరోవైపు టికెట్ రేట్స్ విషయంలో మార్పులు చేయకూడదంటూ ఏపీ అధికారులు కొన్ని జీవోలను విడుదల చేశారు.
వకీల్ సాబ్ కు ఏపీలో ఏర్పడిన అడ్డంకులపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కొంతమంది వకీల్ సాబ్ మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. వకీల్ సాబ్ పైరసీ బారిన పడటంతో ఆ ప్రభావం కూడా సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉంది. వకీల్ సాబ్ గురించి నెగిటివ్ గా ప్రచారం జరుగుతుండటంతో హర్ట్ అయిన హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరు చేసినా వాళ్లను ఎంకరేజ్ చేయాలని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. ఈ డీఫేమింగ్ ఆర్గనైజ్డ్ ట్రెండ్స్ ఏమిటో అంటూ వకీల్ సాబ్ కు వ్యతిరేకంగా ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ల గురించి పూనమ్ స్పందించారు. ఇప్పుడు కుళ్లు రాజకీయాలు ఎవరు చేస్తున్నారు..? అమ్మాయిలను డీఫేమ్ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదు అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లమ్ ఎవరికి..? అని పూనమ్ ప్రశ్నించారు.
ఈ అంశం గురించి నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టాలని పూనమ్ కోరారు. మరోవైపు ఏపీ హైకోర్టు వకీల్ సాబ్ సినిమాకు మూడు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ థియేటర్ల యజమానులకు, డిస్ట్రిబ్యూటర్లకు శుభవార్త చెప్పడం గమనార్హం.