Mahesh Babu, Rajamouli: మహేష్ – రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఫిక్స్!

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసేశారు. ఆ వెంటనే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్ వేసి రావడం. ఇక జనవరి 8 నుండి ప్రమోషన్స్ లో బిజీ అవ్వడానికి రెడీ అవ్వడం జరిగింది. మరోపక్క రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం కూడా మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. స్క్రిప్ట్ చాలా వరకు లాక్ అయ్యింది. ఏప్రిల్ లేదా మే నెల నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ్ నిర్మించనున్నారు.

దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించనున్నారు. పాన్ వరల్డ్ మర్కెట్స్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే.. మహేష్ – రాజమౌళి సినిమాలో ఇండోనేషియన్ భామ చెల్సియా ఇస్లాన్ ఎంపికైందట.

ఈ మధ్యనే ఈమె పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరిగిందట. అయితే ఈమె మహేష్ కి జోడీగా నటిస్తుందా లేక కీలక పాత్ర కోసం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ఈ పాజెక్టు గురించి అన్ని వివరాలు తెలిపే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారం. 3 దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ ఉంటుందని తెలుస్తుంది. మహేష్ బాబు కెరీర్లో ఇది 29 వ సినిమాగా రూపొందనుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus